ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 39
'కేస్ 99' నుండి ఫస్ట్ ఫైల్
'పెళ్లి సందడి' కోసం శ్రీకాంత్ తనయుడు
స్వీటీ @ 4మిలియన్స్ - ఎప్పుడూ నవ్వుతూ ఉండండి
ప్రేక్షకాదరణ పొందిన "రంగస్థలం"
నేను ఎంత ఒంటరిదాన్నో లాక్ డౌన్ లో తెలిసింది
'ముత్తయ్య మురళీధరన్' బయోపిక్ కు టైటిల్ ఫిక్స్
పూర్ణ న్యూ మూవీ ప్రారంభం
మరోసారి నాని కి జోడీగా అనుపమ పరమేశ్వరన్
దేవదాసి పాత్రలో అనసూయ ?
"లవ్ స్టోరీ " డిసెంబర్ లో రిలీజ్ ?
బిజీ యంగ్ హీరో నాగశౌర్య
'వర్మ' సినిమా ఆడిషన్ కోసం సింగిల్ ఫొటోతో..!
అన్నను పిల్లోగా మార్చేసుకున్న అల్లు అర్హ
కంటిన్యూస్ గా 18గంటలు మేజర్ షూట్
"ఆదిపురుష్ " మూవీ లో అజయ్ దేవగన్ ?
"అంధాధున్ " తమిళ రీమేక్ లో ఐశ్వర్య రాయ్ ?
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందిన బాలీవుడ్ మూవీ "అంధాధున్ " ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్ టబు నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు "అంధాధున్ " మూవీ పలు భాషలలో రీమేక్ అవుతుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా "అంధాధున్ " మూవీ తెలుగు లో రీమేక్ కానుంది. హిందీ లో టబు నటించిన పాత్రకు తమన్నా ఎంపిక అయ్యారు. "అంధాధున్ " మూవీ ఇప్పుడు తమిళ భాషలో రీమేక్ కానుంది.
'కేస్ 99' నుండి ఫస్ట్ ఫైల్
నిఖిల్ ,అనువర్ణ ప్రధాన పాత్రల్లో ప్రియదర్శిని రామ్ నటించి దర్శకత్వం వహించిన చిత్రం 'కేస్ 99'. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన దౌర్జన్యానికి మానవసంబంధాలే కారణమని అందరూ ఆలోచిన్తున్న సమయంలో వస్తున్న చిత్రమిదని ఇప్పటికే డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.
'పెళ్లి సందడి' కోసం శ్రీకాంత్ తనయుడు
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాకర్ కాంబినేషన్ లో పాతికేళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందడి సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాకి కీరవాణి అందించిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి.. ఈ సినిమా శ్రీకాంత్ కి మంచి ఇమేజ్ ని తీసుకువచ్చింది.
స్వీటీ @ 4మిలియన్స్ - ఎప్పుడూ నవ్వుతూ ఉండండి
ఒకప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండే సెలబ్రిటీస్ సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో అడుగుపెడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాకు ఎంత సత్తా ఉందో తెలుసు. ఏ విషయాన్నీ అయినా క్షణంలో వైరల్ చేసే సత్తా ఒక్క సోషల్ మీడియాకు మాత్రమే ఉంది. అందుకే తమ సినీ ప్రచారాలకు ఉపయోగపడుతుందని సెలబ్రిటీస్ కూడా సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు. ఒకవేళ అకౌంట్స్ లేకపోయినా క్రియేట్ చేసుకొని మరి అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు.
ప్రేక్షకాదరణ పొందిన "రంగస్థలం"
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , స్టార్ హీరోయిన్ సమంత జంటగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా "రంగస్థలం "మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆది పినిశెట్టి , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. "రంగస్థలం "మూవీ ప్రేక్షకాదరణ పొంది పలు అవార్డ్స్ అందుకుంది.
నేను ఎంత ఒంటరిదాన్నో లాక్ డౌన్ లో తెలిసింది
ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే అలవాటు శ్రుతి హాసన్ ది. ఇక ప్రస్తుతం శృతి హాసన్ హైద్రాబాద్‌లో ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తీసేసినప్పుడే ఇక్కడికి వచ్చేసింది. ప్రస్తుతం ఈ భామ క్రాక్ సినిమా షూటింగ్ లో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ లాక్ డౌన్ లో చాలా విషయాలు తెలుసుకున్నా అంటుంది శృతి హాసన్.
'ముత్తయ్య మురళీధరన్' బయోపిక్ కు టైటిల్ ఫిక్స్
సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటిస్తున్నట్టు రీసెంట్ గా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కు రాకముందు మురళీధరన్ జీవితానికి సంబంధించిన సంఘటనలు.. క్రికెట్ ప్రియులకు, అతని అభిమానులకు ఎవరికీ తెలియని మురళీధరన్ జీవితాన్ని ఇందులోచూపిస్తారట. ప్రస్తుతం విజయ్ సేతుపతి ఆయన బౌలింగ్ శైలితోపాటు మ్యానరిజమ్స్‌ను ను కూడా నేర్చుకునే పనిలో పడినట్టు సమాచారం.
అన్నయ్యకు హాపీ బర్త్ డే - నేను నేర్చుకున్నది ఆయన దగ్గరే
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు లాక్ డౌన్ లో దొరికిన టైంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. తన కుటుంబంతో కలిసి హాయిగా గడిపేస్తున్నారు. పిల్లలతో ఆడుకుంటూ వారితో కాలక్షేపం చేస్తున్నాడు. వాటికి సంబందించిన వీడియోలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే వున్నారు నమ్రత, మహేష్. ఇక ఇప్పుడు తాజాగా మహేష్ అన్నయ్య పుట్టిన రోజు కావడంతో తన అన్నయ్యకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియచేసారు.
పూర్ణ న్యూ మూవీ ప్రారంభం
"శ్రీ మహాలక్ష్మి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూర్ణ మలయాళ , తమిళ , కన్నడ , తెలుగు భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. పూర్ణ ప్రస్తుతం 100(కన్నడ ), "తలైవి "(తమిళ ), ఒక మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. హీరోయిన్ పూర్ణ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మరోసారి నాని కి జోడీగా అనుపమ పరమేశ్వరన్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాని హీరోగా సక్సెస్ ఫుల్ "టాక్సీవాలా" మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో "శ్యామ్ సింగ రాయ్ " మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి ఒక కథానాయిక కాగా మరో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ఎంపిక అయ్యారు. కోల్ కత్తా లో షూటింగ్ కు ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ కరోనా కారణంగా హైదరాబాద్ లో కోల్ కత్తా నేపథ్యంలో సెట్స్ రూపొందించి చిత్రీకరణ జరపాలని నిర్ణయించింది.
సొంత ఊరి గురించి సంపత్ నంది - ప్రకృతికి ఏది సరితూగదు
అశోక్ తేజ దర్శకుడిగా పరిచయమవుతూ.. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ తెరకెక్కుతున్న థ్రిల్లర్ సినిమా 'ఓదెల రైల్వేస్టేషన్'. కన్నడలో 25 చిత్రాలకు పైగా నటించిన వశిష్ట సింహ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్యమైన పాత్రలో హీరోయిన్ హెభా పటేల్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు డీ గ్లామర్ పాత్రలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు కూడా చిత్రయూనిట్. ప్రస్తుతం తెలంగాణలోని ఓదెల ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది.
దేవదాసి పాత్రలో అనసూయ ?
ప్రేక్షకులను తన అందం , అభినయం తో ఆకట్టుకుని అనసూయ సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్నారు. సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని అనసూయ నటిస్తున్న విషయం తెలిసిందే, బ్లాక్ బస్టర్ "రంగస్థలం "మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. స్టార్ యాంకర్ అనసూయ ప్రస్తుతం "ఆచార్య ", "రంగమార్తాండ ", "పుష్ప " మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

బిగ్ బాస్ 4 - 6వ వారం నామినేషన్ లిస్ట్
బిగ్ బాస్ సీజన్ 4 - ఐదు వారాలు పూర్తి చేసుకొని ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఇక సుజాత వెళ్ళిపోతూ బిగ్ బాంబు వేయడంతో ఈ వారం మొత్తం సోహైల్ గిన్నెలు తోమాల్సి వచ్చింది. బిగ్ బాంబ్ లో భాగంగా సోమవారం రోజు ఎపిసోడ్ సోహైల్ గిన్నెలు కడుగుతుండడాన్ని చూపించారు. అయితే పర్సనల్ కప్పులు కూడా కడగకుండా అక్కడే పెట్టి వెళ్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉండటంతో అమ్మ రాజశేఖర్ కలుగ చేసుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేసాడు. అయినా వినకపోవడంతో అక్కడ పెట్టెయ్ నేనే కడుగుతా అని అమ్మ రాజశేఖర్ చెప్పడంతో ఇద్దరి మధ్య కాస్త వాదన జరిగింది.
రాధేశ్యామ్ నుండి పూజా హెగ్డే ఫస్ట్ లుక్ రిలీజ్
జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధే శ్యామ్. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల ఇన్ని రోజులు షూట్ కు బ్రేక్ పడగా ఇటీవలే ఇటలీలో షూటింగ్ ను మొదలుపెట్టారు. వీలైనంత తొందరగా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేసి తిరిగి వచ్చేయాలని ప్లాన్ చేసుకున్నారు టీమ్. అక్టోబర్ నుండి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను మొదలు పెట్టనున్నారు.
"లవ్ స్టోరీ " డిసెంబర్ లో రిలీజ్ ?
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రావు రమేష్ , పోసాని , దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సిహెచ్ సంగీతం అందిస్తున్నారు . చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన "లవ్ స్టోరీ " మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
బిజీ యంగ్ హీరో నాగశౌర్య
కరోనా మహమ్మారి కారణంగా 6 నెలల సుదీర్ఘ విరామం తరువాత చిత్ర పరిశ్రమ షూటింగ్స్ తో కళ కళ లాడుతుంది. సినీ సెలబ్రిటీస్ తమ మూవీ షూటింగ్స్ లో పాల్గొనడం శుభసూచికమే. వరస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బిజీగా ఉన్న యంగ్ హీరో నాగశౌర్య , సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ లో సూపర్ హిట్ "పెళ్ళి చూపులు "మూవీ ఫేమ్ రీతూ వర్మ కథానాయిక.
'వర్మ' సినిమా ఆడిషన్ కోసం సింగిల్ ఫొటోతో..!
సినీ ఇండస్ట్రీలో వారసత్వంతో ఎంట్రీ అవ్వడం అనేది కొంచం ఈజీనే. అయితే ఆ తర్వాత ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోవడం.. టాలెంట్ ను ప్రూవ్ చేసుకోడం అంటే మాత్రం చాలా కష్టం. ఇక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం అంటే అబ్బో చాలా కష్టమే. ఒకరకంగా అన్నిటిని వొదిలేసి భగీరధ ప్రయత్నం చేస్తే కానీ ఒక సినిమాలో హీరో అయ్యే ఛాన్స్ రాదు. ఇప్పుడంటే ఏదో టెక్నాలజీ పెరిగి సోషల్ మీడియా పుణ్యమా అని అది ఈజీ అయింది కానీ.. ఒకప్పుడు మాత్రం చాలా కష్టమయ్యేది. అలా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. స్టార్ హీరోలు అయిన వాళ్లు చాలా తక్కువమంది. అలా స్వయం కృషితో సినీ పరిశ్రమను ఏలింది మెగా…
అన్నను పిల్లోగా మార్చేసుకున్న అల్లు అర్హ
హీరోల సంగతి పక్కన పెడితే వాళ్ల సతీమణులు కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. మహేష్ సతీమణి నమ్రత, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి, ఉపాసన, సమంత ఇలా చాలా మంది సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు.
కంటిన్యూస్ గా 18గంటలు మేజర్ షూట్
గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్ సినిమాలతో అలరించిన అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వాస్తవ ఘటనల ఆధారంగా.. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సగం పైగా షూటింగ్ ను పూర్తి చేసుకోగా కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. అంతేకాదు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్టే చెపుతున్నాడు అడివిశేష్. సినిమా కోసం కంటిన్యూస్ గా 18 గంటలపాటు షూటింగ్ చేశామని.. టీం ను చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపాడు.
"ఆదిపురుష్ " మూవీ లో అజయ్ దేవగన్ ?
టి - సిరీస్ బ్యానర్ పై ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా 3D ఫార్మాట్ లో "ఆదిపురుష్ " హిందీ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో రాముడిగా ప్రభాస్ , రావణుడు గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. 2021 సంవత్సరం జనవరి లో ప్రారంభం కానున్న "ఆదిపురుష్ " మూవీ లో శివుడి పాత్రకై స్టార్ హీరో అజయ్ దేవగన్ ఎంపిక అయ్యారని సమాచారం. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందనున్న "ఆదిపురుష్ " మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.