అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది. సినిమాతో గమ్యం, ప్రస్థానం తరువాత మళ్ళీ అలాంటి బలమైన పాత్రలో శర్వా నటించబోతున్నట్టు ఇప్పటికే చిత్రయూనిట్ తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమాలో అదితి రావు హైదరి నటిస్తున్నట్టువార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో శర్వానంద్ కి జతగా అదితి రావు హైదరి నటించబోతుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. అజయ్ అదితి రావు హైదరికి కథ వినిపించగా ఆమెకు కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుపుతున్నారు.

కాగా ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మరో హీరో సిద్ధార్ద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు
అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లు గా వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత సన్సేషన్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టింది. మరి రెండో సినిమా ఎలా ఉంటుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























