కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 41

సినిమా వార్తలు

జిమ్ లో లావణ్య త్రిపాఠి వర్కౌట్

పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న లావణ్య త్రిపాఠి ప్రస్తుతం హాకీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "A 1 ఎక్స్ ప్రెస్ ", కార్తికేయ హీరోగా రూపొందుతున్న మాస్ ఎంటర్ టైనర్ "చావు కబురు చల్లగా "మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. "A 1 ఎక్స్ ప్రెస్ " మూవీ షూటింగ్ ను లావణ్య కంప్లీట్ చేశారు. ఆ మూవీ రిలీజ్ కై ఆసక్తితో ఎదురు చూస్తున్నానని లావణ్య తెలిపారు.

Team TFNవాట్సాప్
Pushpa Movie Team Heads To East Godavari District For Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

ఈస్ట్ గోదావరి అడవుల్లో "పుష్ప "

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణం గా నిలిచిపోయిన "పుష్ప మూవీ షూటింగ్ ముందుగా కేరళ అడవుల్లో చిత్రీకరణకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది . కరోనా కారణంగా హైదరాబాద్ దగ్గరలోని వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరపాలనుకొన్న ప్లాన్ మార్చి ఈస్ట్ గోదావరి రంప చోడవరం , మారేడు మిల్లి అడవులలో చిత్రీకరణ జరపడానికి చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కల నెరవేరింది -ప్రభాస్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "రాధేశ్యామ్ " మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీ లో జరుగుతుంది . ఈ మూవీ తరువాత వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ , టి -సిరీస్ బ్యానర్ పై ఓం రౌత్ దర్శకత్వంలో "ఆదిపురుష్ "బాలీవుడ్ మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"శ్రీకారం "మూవీ షూటింగ్ పునః ప్రారంభం

కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ సంక్షోభం లో పడిన విషయం తెలిసిందే. మూవీ షూటింగ్స్ నిలిచిపోయి చిత్ర పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు ఇబ్బందికి గురి అయ్యాయి. సినీ సెలబ్రిటీస్ ఇళ్ళకే పరిమితం అయ్యారు. సుమారు 6 నెలల తరువాత షూటింగ్స్ పునః ప్రారంభం అయ్యి చిత్ర పరిశ్రమ కళ కళ లాడుతుంది. కరోనా టైమ్ లో షూటింగ్స్ నిలిచిపోయిన సినిమాలు ఒక్కొక్కటిగా షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. థియేటర్స్ రీ ఓపెనింగ్ తో చిత్ర పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని అందరూ ఎదురుచూస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఓటీటీ

అమెజాన్ ప్రైమ్ లో రానున్న 'మిడిల్ క్లాస్ మెలోడీస్'

పెద్ద సినిమాల సంగతి పక్కన పెడితే చిన్న సినిమాలు మాత్రం ఓటీటీలో రిలీజ్ కే మొగ్గుచూపుతున్నాయి. త్వరలోనే థియేటర్స్ ఓపెన్ చేస్తున్నాకానీ 50 పెర్సెంట్ సిట్టింగ్ కు మాత్రమే పర్మిషన్ ఇవ్వనున్నారు. మరి పెద్ద సినిమాలకు అయితే ఇది కొంచం వర్క్ అవుట్ అవుద్దేమో కానీ.. చిన్న సినిమాలకు మాత్రం కొంచం కష్టమే. ఎందుకంటే చిన్న సినిమాలకు మొదట జనాలు రావడమే కష్టం.. ఒకవేళ సినిమా కనుక మంచి టాక్ ను తెచ్చుకుంటే ఇక ఆ సినిమాకు తిరిగుండదు. అయితే అంత రిస్క్ తీసుకోడవం ఎందుకులే.. ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ చేస్తేనే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని ప్లాన్ చేసుకుంటున్నారు.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - అభిజిత్ ప్లాన్ ప్లాప్.. కెప్టెన్ గా సోహైల్

మొత్తానికి మూడురోజులుగా జరుగుతున్న కెప్టెన్సి టాస్క్ బీబీ హోటల్ నిన్నటితో ముగిసింది. ఫైనల్ గా రెండు రోజులు సాగిన ఈ టాస్క్ లో అతిధుల టీమ్ గెలిచింది. గెస్ట్ టీం ఇవ్వాల్సిన 5 స్టార్స్ అభిజిత్ దగ్గరే ఉంచుకున్నాడు. ఐదు స్టార్ లు దొంగిలించి బిగ్ బాస్ కు మేమే గెలిచాం.. ఐదు స్టార్ లు మాదగ్గరే ఉన్నాయని చెప్పాడు అభిజిత్. దానికి బిగ్ బాస్ అతిథుల టీం ను ఎన్ని స్టార్ లు మీరు ఇచ్చారో చెప్పండి అని అడిగాడు. అందరూ కలిసి ఒక్క స్టార్ ఇచ్చినట్టు చెప్పారు. దీంతో బిగ్ బాస్ అతిథుల టీం గెలిచినట్టు ప్రకటించాడు.

TFN Adminవాట్సాప్
Big B Amitabh Bachchan To Play A Pivotal Role In Prabhas 21
సినిమా వార్తలు

ఆఫీషియల్ 'ప్రభాస్ 21' లో బిగ్ బీ

నాగ్ అశ్విన్ - ప్రభాస్ సినిమా కు సంబంధించి ఈ రోజు బిగ్ అనౌన్స్ మెంట్ ఇస్తామని చెప్పినదగ్గరనుండి ఏం అప్ డేట్ ఇస్తారబ్బా అని రాత్రి నుండి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. 10 ఎప్పుడు అవుతుందా అని రాత్రి నుండి గడియారం వంక అలా చూస్తూనే ఉండిపోయి ఉంటారు ప్రభాస్ అభిమానులు. ఇప్పుడు ఆ సస్పెన్స్ కు తెరపడింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మళ్లీ జన్మలో నువ్వే కూతురిగా పుట్టాలి

మంచు వారసురాలిగా మంచు లక్ష్మీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ రోజు మంచు లక్ష్మీ పుట్టినరోజు కావడంతో మంచు లక్ష్మీని ఉద్దేశిస్తూ మోహన్ బాబు ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా `. `వజ్ర వైఢూర్య పుష్య గోమేదిక మరకత మాణిక్యం లాంటి ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న పుట్టిన రోజు ఈ రోజు. మరొక జన్మంటూ ఉంటుందో లేదో తెలియదు గానీ, ఉంటే మళ్లీ ఈ లక్ష్మి ప్రస్నన్నే నాకు కూతురుగా పుట్టాలని, నేను తనకు తండ్రిగా పుట్టాలని ఆ పంచభూతాలను ప్రార్థిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే టు మై డియర్ లవ్లీ లక్ష్మీ మంచు` అని తాను లక్ష్మీని ఎత్తుకున్న చిన్ననాటి ఫొటోను షేర్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీ - రేపు బిగ్ అనౌన్స్ మెంట్

అలా నిన్న ప్రభాస్ పుట్టిన రోజుకంటే ముందే బిగ్ సర్ ప్రయిజ్ ఉందని నాగ్ అశ్విన్ చెప్పాడో లేదో ఇలా వెంటనే అప్ డేట్ ఇచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ కు మాములు షాక్ ఇవ్వలేదు. పుట్టిన రోజు ముందు అంటే ఇంకా చాలా టైమే ఉంది అని లైట్ తీసుకున్నారు కానీ రేపు బిగ్ అన్నౌన్స్ మెంట్ ఉందని చెప్పి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాను నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా రేపు ఉదయం 10 గంటలకు బిగ్ సర్ప రైజ్ ఉందని తెలుపుతూ ట్వీట్ చేసారు…

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'మోస‌గాళ్లు' - రుహీ సింగ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు కాజల్‌ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది. ప్రస్తుతం కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విష్ణు, కాజల్‌ ఫస్ట్‌, సునీల్‌ శెట్టి, కాజల్ ఫస్ట్‌ లుక్ పోస్టర్ లను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Actress Alia Bhatt To Join RRR Movie Shooting In November
షూటింగ్ అప్‌డేట్

నవంబర్ లో "RRR" షూటింగ్ లో అలియాభట్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ కథానాయకులుగా భారీ బడ్జెట్ తో "రౌద్రం రణం రుధిరం " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ , కొమరం భీం గా నటిస్తున్న ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వెకేషన్ లో తాప్సీ

తెలుగు , తమిళ , హిందీ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తాప్సీ ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. లాక్ డౌన్ తరువాత తాప్సీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న "అనబెల్లె సుబ్రమణ్యం "తమిళ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. రాజస్థాన్ లో షూటింగ్ జరుపుకున్న ఆ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. వెకేషన్స్ లో తన సోదరి తో టూర్స్ కు వెళ్ళే అలవాటు ఉన్న తాప్సీ తన సోదరి , మరికొంతమంది స్నేహితులతో మాల్దీవులకు వెళ్ళారు .

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కీర్తి సురేష్ ఫొటో షూట్

తెలుగు , తమిళ , మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ కీర్తి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. 6నెలల తరువాత కీర్తి "రంగ్ దే!"మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. కీర్తి సురేష్ నటించిన "మిస్ ఇండియా "," గుడ్ లక్ సఖి ", "మరక్కార్ "(మలయాళ ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కీర్తి హీరోయిన్ గా రెండు తమిళ మూవీస్ చిత్రీకరణ దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సెట్స్ లో అందరితో కలసిపోతా -నివేత పేతురాజ్

"మెంటల్ మదిలో "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కోలీవుడ్ నటి నివేత పేతురాజ్ "చిత్రలహరి ", "బ్రోచేవారెవరురా ", "అల .. వైకుంఠపురములో .. "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నివేత కథానాయికగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ "RED " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. నివేత నటించిన రెండు తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. హీరో సాయితేజ , దేవాకట్టా కాంబినేషన్ మూవీ "#SDT 14"లో నివేత కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కె.జి.యఫ్2 సెట్ లోఅడుగుపెట్టిన రాఖీ భాయ్

కె.జి.యఫ్ సీక్వెల్ కె.జి.యఫ్2 కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఈ కరోనా వచ్చి నిరాశనే మిగిల్చింది. ఇక ప్రస్తుతం కె.జి.యఫ్2 సినిమా షూటింగ్ చివరి దశలో వుంది. లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి షూటింగ్ పూర్తయ్యేది. ఇక ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు. ఇక ఇప్పుడు ఈ షూటింగ్ లో రాఖీ భాయ్ కూడా అడుగుపెట్టాడు. ఇక ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా తెలిపాడు. అంతేకాదు అలలను ఆపడం కష్టం.. కానీ ఆ అలలలో ఈదడం నేర్చుకోవచ్చు.. చాలా గ్యాప్ తర్వాత కె.జి.యఫ్2 లో షూట్ కు రెడీ అవుతున్నా అంటూ ఇన్స్టా లో పేర్కొన్నాడు.

TFN Adminవాట్సాప్
Throwback Thursday: Megastar Chiranjeevi and Ram Charan Make One Of The Best On Screen Pairs Of Tollywood
సినిమా వార్తలు

అప్పుడు-ఇప్పుడు సూపర్ బాండింగ్

సినీ చరిత్రలో మెగా ఫ్యామిలీకి ఒక పేజీ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి కారణం ఎవరో కూడా అందరికీ తెలుసు. తెలుగు సినిమాకే కాదు.. మెగా ఫ్యామిలీకి కూడా ఒక మూలస్తంభం అయిన మెగాస్టార్ చిరంజీవి. ఇక చిరుకి తనయుడు మెగా పవర్ స్టార్ కు ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత దేశానికి రాజు అయినా తల్లికి కొడుకే అన్నట్టు.. ఎంత స్టార్, సూపర్ స్టార్ లైనా పిల్లలకు సాధారణ మనుషులే. మరి ఇక మెగా పవర్ స్టార్ రేంజ్ కు ఎదిగినా కూడా చిరు మాత్రం ఎప్పటికీ తనకు ముద్దుల కొడుకే. పలు సందర్భాల్లో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మనకు తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని పిక్స్ ను చూద్దాం..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అఫీషియల్.. ముత్తయ్య మురళీధరన్ గా విజయ్ సేతుపతి

ఇప్పటి వరకూ తెలుగు, తమిళ్, హిందీలో ఎంతోమంది క్రీడాకారుల బయోపిక్ లు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎం.ఎస్ ధోని, కపిల్ దేవ్, పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్ ఇలా పలువురి బయోపిక్ లు తెరకెక్కాయి.. తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో లెజెండ్ క్రికెటర్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఆయనెవరో కాదు... సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Actress Pooja Hedge Heads To Italy To Join Movie Shoot Of Radhe Shyam
సినిమా వార్తలు

"హలో ఇటలీ "- పూజాహెగ్డే

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి - సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా యూరోప్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు . ఇటలీ , జార్జియాలలో షూటింగ్ జరుపుకున్న "రాధేశ్యామ్ " మూవీ షూటింగ్ కరోనా కారణం గా నిలిచిపోయింది.

Team TFNవాట్సాప్
Tuck Jagadish Movie Team Resume Shooting Work.
షూటింగ్ అప్‌డేట్

"టక్ జగదీష్ "షూటింగ్ పునః ప్రారంభం

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం లో నాని హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. సుమారు 40 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న "టక్ జగదీష్ " మూవీ కరోనా కారణం గా షూటింగ్ వాయిదా పడింది.

Team TFNవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 .. అభిజిత్ ట్రిక్ తో హారిక కంటతడి

బిగ్ బాస్ హౌస్ లో 31వ రోజు... మొన్న రాత్రి బీబీ హోటల్ టాస్క్ నిన్న రాత్రి కూడా కొనసాగింది. కామెడీ గా ఒకరి మీద ఒకరు పంచ్ లు వేసుకోవడంనుండి మొదలైన‌ టాస్క్‌ కాస్త సీరియస్‌గా మారింది. ఇక మొన్న జరిగినట్టే రిచ్ పీపుల్స్ సర్వీస్ అడగడం... హోటల్ స్టాఫ్ వారికి ఏదో ఒక కౌంటర్ వేస్తూ ఫుడ్ ఇవ్వడం జరిగింది. అయితే అవినాష్ సీక్రెట్ టాస్క్ లో భాగంగా రైస్ లో పిన్ పెట్టడం... మటన్ కర్రీ లో సాల్ట్ ఎక్కువ అవడం.. దానితో రిచ్ పీపుల్స్ హోటల్ స్టాఫ్ కు మాత్రం టిప్ ఇవ్వడానికి నిరాకరించారు. వారి చేష్టలు హోటల్‌ సిబ్బందికి కోపం తెప్పిస్తున్నప్పటికీ ఓపికతో అడిగిన పనులన్నీ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్