బిగ్ బాస్ 4 – ‘బిగ్ బాస్’ గా మారిన అవినాష్

Jabardasth Fame Avinash Turns Bigg Boss In Bigg Boss Season 4 Show

బిగ్ బాస్ 4 – నామినేషన్, కెప్టెన్సీ టాస్క్ అంటూ లగ్జరీ బడ్జెట్ ఇలా బిజీగా అలానే కష్టపడినా హౌస్ మేట్స్ నిన్న కాస్త రిలాక్స్ అయ్యారు . నిన్న ఎపిసోడ్ మాత్రం కొంచం కూల్ గా వెళ్ళిపోయింది. ఇక మార్నింగ్ మ‌స్తీలో భాగంగా అందరూ తమకు ఎదురైనా కష్టాలు, బాధలు గురించి మాట్లాడరు. దీనిలో భాగంగా అందరూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఆ త‌ర్వాత ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ల‌గ్జ‌రీ బ‌డ్జెట్‌ టాస్క్‌లో ఎవ‌రు ఎక్కువ కార్డ్స్ పొందితే వారికి ప్ర‌త్యేక‌మైన గిఫ్ట్‌తో పాటు ఆయిల్‌తో మ‌సాజ్ చేసుకొనే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని తెలిపారు బిగ్ బాస్. పోటీలో మెహ‌బూబ్, అఖిల్‌లు పాల్గొన‌గా మెహ‌బూబ్ 12 పాయింట్స్‌తో విజేత‌గా నిలిచాడు. దీంతో అతనికి గిఫ్ట్‌తో పాటు మోనాల్‌తో మ‌సాజ్ చేయించుకునే అవ‌కాశం ద‌క్కింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు గత వారం ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ గురించి అఖిల్ మోనాల్ తో మాట్లాడతాడు. నా వ‌ల‌న అంద‌రికి తిండి లేకుండా పోయింద‌ని అంద‌రు తెగ బాధ‌ప‌డ్డారు. కాని ఇప్పుడు అదే తింటున్నారు. ఈ పాయింట్ గుర్తు పెట్టుకో. నేను అన్న‌మే ముట్టను అంటూ మోనాల్‌తో త‌న బాధ‌ను చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను కాస్త ఎంటర్ టైన్ చేసేలా అవినాష్ ను బిగ్ బాస్ గా మర్చి కామెడీ అందించాడు. ఇక ఇన్నాళ్ళు కేవ‌లం త‌న వాయిస్‌తోనే మిమ్మ‌ల్ని అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు మీ ముందు సాక్షాత్కారం కాబోతున్నాడు. బిగ్ బాస్ ఆత్మ అవినాష్‌లోకి వ‌స్తుంది. ఆయ‌న ద్వారా మీరు ఎలాంటి ప్ర‌శ్న‌లైన అడ‌గొచ్చు. వాటికి అవినాష్ త‌ప్ప‌క స‌మాధానం ఇస్తార‌ని బిగ్ బాస్ చెప్తారు. ఉరుములు మెరుపులు రాగానే బిగ్ బాస్ ఆత్మ అవినాష్‌లోకి వ‌చ్చేసింది. ఆయ‌న‌ని హౌజ్‌మేట్స్ స‌ర‌దా ప్ర‌శ్న‌లు అడ‌గ‌గా, వాటికి ఫ‌న్నీ ఆన్స‌ర్స్ ఇచ్చాడు అవినాష్‌.

ఇక అఖిల్‌, అభిజిత్‌, మోనాల్ ల మ‌ధ్య ఉన్న రిలేషన్ గురించి మోనాల్ తోనే దివి,రాజ‌శేఖ‌ర్‌లు ఈ టాపిక్‌పై మాట్లాడారు. దివి.. మోనాల్‌తో మాట్లాడుతూ.. మీ ముగ్గురి మ‌ధ్య ఏం జరుగుతుందో నాకు తెలియ‌దు కాని, మోనాల్‌కు నేనంటే ఇష్ట‌మ‌ని అభి, అఖిల్‌లు ఫీల‌వుతున్నారు. ఈ విష‌యంలోనే వారిద్ద‌రు కాస్త హ‌ర్ట్ అవుతున్న‌ట్టుగా క‌నిపిస్తుంది. ఇద్ద‌రు జెన్యూన్‌గానే ఉంటున్నారు కాని, ఇద్ద‌రి మైండ్‌లో నువ్వేమ‌న్నా క్రియేట్ చేసావేమో అనిపిస్తుంది అని దివి చెప్పుకొచ్చింది. దీనికి మోనాల్‌.. ‘నేను ఇద్దర్నీ లైక్ చేస్తున్నా.. కానీ పేరుని వాడటం ఇష్టం లేదు.. మా మధ్య ఏం జరగలేదు.. చిన్న మ్యాటర్‌ని పెద్దదిగా చేస్తున్నారు’ అని క్లారిటీ ఇచ్చింది మోనాల్. మరి ఈ టాపిక్ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఇక వీకెండ్ వచ్చేసింది. ఎలిమినేష‌న్ ప్రక్రియ ఉండ‌నుండ‌గా, ఎవ‌రు ఇంటి నుండి బ‌య‌ట‌కు వెళతారో తెలుసుకోవాలంటే మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.