లాక్ డౌన్ వల్ల సినిమాల షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే కదా. ఏదో ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇప్పుడిప్పుడే కాస్త ముందుకొచ్చి తక్కువమంది సిబ్బందితో.. జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక సినిమా థియేటర్లలో బొమ్మ పడి ఆరు నెలలు పూర్తి అయ్యింది. కొద్దిరోజుల్లో థియేటర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఇక ఈ కరోనా వల్ల థియేటర్స్ లేక బిజినెస్ లేక సినీ పరిశ్రమకు కొన్ని కోట్లలో నష్టం కలిగిన సంగతి తెలిసిందే. మరో పక్క ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పుంజుకున్నాయి. మొదట చిన్న సినిమాలు రిలీజ్ అయ్యేవి.. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా ఓటీటీ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే తెలుగులో నాని ‘వి’, నిశ్శబ్దం సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఒక రకంగా చిన్న సినిమాలకు థియేటర్స్ కంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఏ బెటర్ అని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా చిన్న సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా… ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ సూపర్ ఫామ్ లో వుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళంతో సహా 5 భాషలలో 9 సినిమాలు అమెజాన్ లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. తెలుగు నుండి మిడిల్ క్లాస్ మెలోడీస్ వరుణ్ ధావన్ మరియు సారా అలీ ఖాన్ నటించిన కూలీ నంబర్ 1, రాజ్‌కుమార్ రావు నటించిన చలాంగ్, భూమి పెడ్నేకర్ యొక్క దుర్గావతి,మాధవన్ నటించిన మారా (తమిళం), అరవింద్ అయ్యర్ నటించిన భీమ సేన నల మహారాజా మరియు హలాల్ లవ్ స్టోరీ (మలయాళం) 2020 అక్టోబర్ 15 నుండి అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానున్నాయి.
* హలాల్ లవ్ స్టోరీ (మలయాళం) అక్టోబర్ 15
* భీమ సేన నలమహరాజా (కన్నడ) అక్టోబర్ 29
* సూరరై పొట్రూ (తమిళం) అక్టోబర్ 30
* ఛలాంగ్ (హిందీ) నవంబర్ 13
* మన్నే నెంబర్ 13 (కన్నడ)
* మిడిల్ క్లాస్ మెలోడీస్ (తెలుగు) నవంబర్ 20
* దుర్గావతి (హిందీ) డిసెంబర్ 11
* మారా (తమిళం) డిసెంబర్ 17
* కూలీ నెంబర్ 1 (హిందీ) ఈ సినిమా డిసెంబర్ 25
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: