సిక్స్ ప్యాక్ తో విజయ్ దేవరకొండ ?
Tollywood Actor Vijay Deverakonda To Flaunt His Six Pack Abs In Puri Jagannadh Fighter Movie
"అర్జున్ రెడ్డి ", "గీత గోవిందం " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా రాణిస్తున్నారు. క్రేజీ హీరో విజయ్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ "ఫైటర్" లో నటిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో క్యారెక్టర్ కై విజయ్ థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన "ఫైటర్ " మూవీ షూటింగ్ త్వరలో హైదరాబాద్ లో పునః ప్రారంభం కానుంది.
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ , అనన్య పాండే జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్" మూవీ తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతుంది. హీరో విజయ్ ఇప్పుడు "ఫైటర్ " మూవీ క్లైమాక్స్ ఫైట్ కై సిక్స్ ప్యాక్ అబ్స్ ట్రై చేస్తున్నారని సమాచారం. సో , హీరో విజయ్ తన సిక్స్ ప్యాక్ అబ్స్ తో "ఫైటర్ " మూవీ లో కనిపించి ప్రేక్షక , అభిమానులను అలరించనున్నారు. ఈ మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.







