అపజయం ఎరుగని దర్శక ధీర రాజమౌళి బర్త్ డే ఈ రోజు . రాజమౌళి ఈ రోజు తో 47 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 48 వ సంవత్సరంలో అడుగుపెడుతున్నారు. దర్శకుడు రాజమౌళి కి సినీ ప్రముఖుల బర్త్ డే శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. ఇప్పుడు దర్శకుడు రాజమౌళి సక్సెస్ ఫుల్ సినీ జర్నీ గురించి తెలుసుకుందాం. సూపర్ హిట్ “స్టూడెంట్ నెం 1 ” మూవీ తో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయం అయిన రాజమౌళి బ్లాక్ బస్టర్ “సింహాద్రి మూవీ తో భారీ విజయాన్ని సాధించారు. సూపర్ హిట్ “సై ” మూవీ తో రాజమౌళి హ్యాట్రిక్ సాధించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఛత్రపతి ” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా మారారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన రవితేజ “విక్రమార్కుడు”, ఎన్టీఆర్ “యమదొంగ “, రామ్ చరణ్ “మగధీర “, సునీల్ “మర్యాద రామన్న “, నాని “ఈగ ” మూవీస్ ఘనవిజయం సాధించి ప్రేక్షకులను అలరించాయి. భారీ బడ్జెట్ , తారాగణం తో విజువల్ వండర్ “బహుబలి “, “బాహుబలి 2” మూవీస్ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేశాయి. “బహుబలి “, “బాహుబలి 2” మూవీస్ తో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా చాటి చెప్పారు. ఈ మూవీస్ నేషనల్ అవార్డ్స్ తో పాటు పలు అవార్డ్స్ గెలుచుకుని కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేశాయి. బెస్ట్ ఫిల్మ్స్ గా 3 నేషనల్ , బెస్ట్ డైరెక్టర్ గా 4నంది , 4 ఫిల్మ్ ఫేర్ , బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డ్స్ అందుకున్న స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా “రౌద్రం రణం రుధిరం ” మూవీ ని తెరకెక్కిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ , స్టార్ హీరోస్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మనం కూడా రాజమౌళి కి బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుదాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: