జక్కన్నకు ‘RRR’ టీమ్ బర్త్ డే విషెస్

RRR Movie Team Sends Out Wishes To SS Rajamouli As We Celebrates His Birthday Today

`బాహుబలి`సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకదిగ్గజం రాజమౌళి. ఇక ఈరోజు రాజమౌళి పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు విషెస్ తెలియజేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్న న‌టీన‌టులు కూడా జక్కన్నకు సోషల్ మీడియా ద్వారా స్పెష‌ల్ విషెస్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రియమైన రాజమౌళి గారు ఇలాంటి సంతోషకరమైన రోజులు ఎన్నో రావాలి. మీ గురించి తెలుసుకోవ‌డం, మీతో ప‌నిచేయ‌డం గౌర‌వంగా భావిస్తున్నాను. పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు స‌ర్ అని పేర్కొన్నారు.

రాజ‌మౌళితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ, పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు జ‌క్క‌న్న‌.. ల‌వ్ యూ అని ట్వీట్ చేశాడు.

విమర్శకుల గొంతు కంటే ఆయన విజయాలు మరింత పెద్దవి. నా గురువుకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంటూ రామ్ చ‌ర‌ణ్ ట్వీట్ చేశారు.

 

 

మీ సినిమాల మాయాజాలం ఎల్ల‌ప్పుడు ప్ర‌పంచాన్ని ప్ర‌కాశ‌వంతంగా చేస్తుందని అలియా భ‌ట్‌ ట్వీట్ చేసింది.

ఇంకా వీరితోపాటు మ‌హేష్ బాబు, వెంక‌టేష్‌, రామ్ పోతినేని, బాబీ, అనీల్ రావిపూడితో పాటు ప‌లువురు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, ర‌చ‌యిత‌లు, స్టార్స్ జ‌క్క‌న్న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

కాగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. దాదాపు 7 నెలల తర్వాత హైదరాబాద్ శివారులో ఉన్న అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను ప్రారంభించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 9 =