‘ఈవారం’ ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ అప్ డేట్స్

Checkout these prime tollywood movie updates for this week

గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు ‘దితెలుగుఫిలింనగర్ .కమ్’ ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆఫీషియల్ ‘ప్రభాస్ 21’ లో బిగ్ బీ

నాగ్ అశ్విన్ – ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కు సంబంధించి బిగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో భారీ కాస్ట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనెను హీరోయిన్ గా సెలెక్ట్ చేయిగా.. ఇప్పుడు మరో లెజెండరీ యాక్టర్ ను ఎంపిక చేశారు. ఆ నటుడు ఎవరో కాదు బాలీవుడ్ నటుడు అమితాబ్. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు వైజయంతి మూవీస్ సంస్థ. ఒక లెజెండరీ నటుడు లేకుండా ఇంత భారీ సినిమా ఎలా తీయగలం అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు.

 

అమెజాన్ ప్రైమ్ లో రానున్న ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా వినోద్ అనంతోజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా `మిడిల్ క్లాస్ మెలోడీస్‌`. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను కూడా అమెజాన్ లో రిలీజ్ చేయనున్నారు. వచ్చే నెల నవంబర్ 20వ తేదీన ఈ సినిమాను అమెజాన్ లో రిలీజ్ చేయనున్నారు. కాగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ భ‌వ్య క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ లో వెనిగ‌ళ్ళ ఆనంద‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో “పెళ్ళి సందడి “

కె . కృష్ణమోహన్ రావు సమర్పణలో ఆర్ కె ఫిల్మ్ అసోసియేట్స్ , ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ పై రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “పెళ్ళి సందడి ” మూవీ రూపొందనుంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. “పెళ్ళి సందడి “మొదలవ్వబోతుంది , తారాగణం త్వరలో” అంటూ దర్శకుడు రాఘవేంద్ర రావు ట్వీట్ చేశారు.

 

‘మోస‌గాళ్లు’ – రుహీ సింగ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు కాజల్‌ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విష్ణు, కాజల్‌ ఫస్ట్‌, సునీల్‌ శెట్టి, కాజల్ ఫస్ట్‌ లుక్ పోస్టర్ లను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో హీరో విష్ణు మంచు స‌ర‌స‌న నాయిక‌గా రుహీ సింగ్ న‌టిస్తున్నారు. ఆమెకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

కె.జి.యఫ్2 సెట్ లోఅడుగుపెట్టిన రాఖీ భాయ్

కె.జి.యఫ్ సీక్వెల్ కె.జి.యఫ్2 సినిమా షూటింగ్ చివరి దశలో వుంది. లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి షూటింగ్ పూర్తయ్యేది. ఇక ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు. ఇక ఇప్పుడు ఈ షూటింగ్ లో రాఖీ భాయ్ కూడా అడుగుపెట్టాడు. ఇక ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా తెలిపాడు. అంతేకాదు అలలను ఆపడం కష్టం.. కానీ ఆ అలలలో ఈదడం నేర్చుకోవచ్చు.. చాలా గ్యాప్ తర్వాత కె.జి.యఫ్2 లో షూట్ కు రెడీ అవుతున్నా అంటూ ఇన్స్టా లో పేర్కొన్నాడు.

 

 

View this post on Instagram

 

Waves can’t be stopped but you can learn to sail.. After a long break.. Rocky sets sail from today.

A post shared by Yash (@thenameisyash) on

ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో విజయ్ సేతుపతి

సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ బయోపిక్ లో ముత్తయ్య మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటన చేసారు. మూవీకి సంబంధించిన అఫీషియ‌ల్ అప్ డేట్ త్వ‌ర‌లోనే రానుంద‌ని ప్ర‌క‌టించారు. అంతర్జాతీయ క్రికెట్ కు రాకముందు మురళీధరన్ జీవితానికి సంబంధించిన సంఘటనలు.. క్రికెట్ ప్రియులకు, అతని అభిమానులకు ఎవరికీ తెలియని మురళీధరన్ జీవితాన్ని ఇందులోచూపిస్తారట.

హాలీవుడ్ మూవీ గా యండమూరి”ఆనందో బ్రహ్మ “

స్టార్ రైటర్ యండమూరి వీరేంద్ర నాథ్ తన నవలలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. యండమూరి నవలలో “ఆనందో బ్రహ్మ ” తప్ప మిగతా నవలలు అన్నీ సినిమాలు గా రూపొందాయి. ఇప్పుడు యండమూరి నవల “ఆనందో బ్రహ్మ ” హాలీవుడ్ మూవీ గా తెరకెక్కనుంది. 1729 హాలీవుడ్ నిర్మాణ సంస్థ అధినేత ముక్తేష్ రావు మేక “ఆనందో బ్రహ్మ “నవలను హాలీవుడ్ మూవీ గా రూపొందించడానికి రైట్స్ ను స్వంతం చేసుకున్నారు. గోదావరి నది బ్యాక్ డ్రాప్ లో రూపొందిన నవలను మిసిసిపీ నది బ్యాక్ డ్రాప్ లో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నానని ముక్తేష్ రావు తెలిపారు.

‘క్రాక్’ ఆఖరి షెడ్యూల్ స్టార్ట్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే 90 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈ సినిమా. కేవలం 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలింది. లాక్ డౌన్ విధించడంతో షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. త్వరలోనే పాటలు, ట్రైలర్ కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్.

దేవ కట్టా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సాయి తేజ్

సాయి తేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేత పేతురాజ్ కథానాయిక కాగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించనున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు సాయి తేజ్, దేవ కట్టా. దేవ కట్టతో కలిసి ప్రీప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటున్న ఫొటో ఒకదాన్ని షేర్ చేసి 14వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నామని, దేవ కట్ట కథను గొప్పగా రాశారని, సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నామని పోస్ట్ పెట్టారు.

 

‘వకీల్ సాబ్’ సెట్ లో నివేదా

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే . వకీల్ సాబ్ చిత్ర యూనిట్ కూడా షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి కూడా విదితమే. కొద్దిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా..ప్రస్తుతం హైదరాబాదు పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నారు. ఇక ఈ సినిమాలో నివేదా థామస్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. నివేదా తాజాగా వకీల్ సాబ్ షూటింగ్ లో పాల్గొంది. వకీల్ సాబ్ సెట్ ఫొటో ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉందని తెలిపింది.

 

పెళ్లికి ముహూర్తం ఫిక్స్

స్టార్ హీరోయిన్ కాజల్ వివాహం కూడా కన్ఫామ్ అయిపోయింది. ఈ వార్త మీతో పంచుకుంటునందుకు చాలా సంతోషంగా ఉంది..అవును నేను గౌతమ్ కిచ్లూ ని వివాహం చేసుకోబోతున్నాను.. అక్టోబర్ 30న పెళ్లి జరగబోతుందని తెలిపింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అతిథులను మాత్రమే ఆహ్వానిస్తున్నాం.. తన సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచి ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కాజల్‌ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేసింది.

 

‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ప్రారంభం

మొత్తానికి ఏ సినిమా అప్ డేట్ కోసం.. ఏ సినిమా షూటింగ్ కోసం ఇన్ని రోజులు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారో ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. కరోనా వల్ల మార్చి నుండి షూటింగ్ ను జరపలేదని.. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశామని తెలుపుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో గేట్స్ తెర‌వ‌డం, దుమ్ము ప‌ట్టిన వ‌స్తువుల‌ను దుల‌ప‌డం, లొకేష‌న్ ప‌రిస‌రాల‌ని శుభ్ర‌ప‌ర‌చ‌డంకు సంబంధించిన విజువ‌ల్స్ చూపించారు. అంతేకాదు భీమ్‌కు సంబంధించిన స‌ర్‌ప్రైజింగ్ వీడియోను అక్టోబ‌ర్ 22న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఈ వీడియో ద్వారా తెలియ‌జేశారు.

 

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 16 =