'క్రాక్' మేకింగ్ వీడియో
Mass Maharaja Ravi Teja Shares A Glance of Krack Movie Shoot On Instagram
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ లాక్ డౌన్ ముందే ముగింపు దశకు వచ్చింది. కేవలం 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలిఉండగా.. ఇక ఇప్పుడు షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా మేకింగ్ వీడియో ఒకటి విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలు.. ఇందులో కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ ఎలా జరుపుతున్నారో చూపించారు. వీడియో చివరన స్టేషన్‌లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టుకోవడం నేర్చుకో అంటూ రవితేజ సీరియస్‌గా డైలాగ్ చెప్పడం ఉంటుంది.
కాగా ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ సినిమాతో శ్రుతి హాసన్ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను... సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.







