“నన్ను దోచుకుందువటే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నభా నటేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకుల హృదయాలు దోచుకున్నారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నభా నటేష్ ప్రేక్షకుల ప్రశంసలతో పాటు పలు మూవీ ఆఫర్స్ అందుకున్నారు. సాయి ధరమ్ తేజ్ “సోలో బ్రతుకే సో బెటర్ “, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ “అల్లుడు అదుర్స్ ” మూవీస్ లో నభా నటేష్ కథానాయికగా నటిస్తున్నారు. “సోలో బ్రతుకే సో బెటర్ ” మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




హీరోయిన్ నభా నటేష్ ప్రస్తుతం “అల్లుడు అదుర్స్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియా లో తన ఫొటోస్ షేర్ చేస్తూ నభా అభిమానులను అలరిస్తున్నారు. చిత్ర కళాభిరుచి ఉన్న నభా ఇప్పుడు బ్యాట్ మ్యాన్ పెయింటింగ్ తో అభిమానులను ఆశ్చర్య పరిచారు. 6 నుండి 7 సెషన్స్ లో బ్యాట్ మ్యాన్ పెయింటింగ్ వేశాననీ , ఒకవేళ మీరు బ్యాట్ మ్యాన్ అభిమాని అయితే తాను వేసిన పెయింటింగ్ కు గర్వపడతారనీ, ఆ పెయింటింగ్ ను నభా నటేష్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. నభా నటేష్ చిత్ర కళా నైపుణ్యం అభిమానులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: