రాజమౌళి పై ‘RRR’ టీమ్ ఫిర్యాదులు

RRR Movie Team Complaints On Director SS Rajamouli

ఒక్కో సినిమాను రాజమౌళి ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దుతాడో అందరికీ తెలుసు. ఒక శిల్పాన్ని ఎంతో జాగ్రత్తగా ఎలా చెక్కుతారో అలా చెక్కుతాడు కాబట్టే ఆయనకు జక్కన్న అన్న పేరు పెట్టారు. అలా ఉంటాడు కాబట్టే మన తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో పేరు రావడానికి కారణమయ్యాడు. దేశం గర్వించదగ్గ దర్శకుడు అయ్యాడు. ఇక ఈ రోజు రాజమౌళి పుట్టిన రోజు నేపథ్యంలో ఆయనకు సినీ ప్రముఖుల నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే విచిత్రం ఆర్ఆర్ఆర్ టీం మాత్రం ఆయనపై ఫిర్యాదులు చేస్తున్నారు. సీరియస్ గా ఏం కాదులెండి కామెడీగా. సెట్స్ లో రాజ‌మౌళి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ టీం స‌భ్యులు ఆయ‌న సెట్‌లో ఎలా ఉంటార‌నే విష‌యాన్ని వీడియో ద్వారా చెప్పుకొచ్చారు. దేనిని ఓ ప‌ట్టాన ఓకే చేయ‌డ‌ని వారు చెబుతుండ‌గా, ప్ర‌తి సీన్‌ని పవర్‌ఫుల్‌గా ఎలివేట్ చేయాల‌నే రాజ‌మౌళి చేస్తుంటారని చెపుతున్నారు. మరి ఎవరెవరు ఏం చెపుతున్నారో కింద వీడియో క్లిక్ చేసి చూడండి మీరు కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా… ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా మొదలు పెట్టి కూడా దాదాపు రెండేళ్లు అవుతుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుందిలే అనుకున్నారు కానీ కరోనా వచ్చి పడటంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. మళ్లీ రీసెంట్ గానే షూటింగ్ ను మొదలుపెట్టారు.

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 8 =