ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 26
నా అభిమాన క్రికెటర్ కోహ్లీ హ్యాపీ బర్త్ డే
ఇటలీ బీచ్ లో పూజాహెగ్డే
మాస్క్ బ్యూటీ తమన్నా
షూటింగ్స్ తో రాశీఖన్నా బిజీ
'నారప్ప' షూటింగ్ షురూ త్వరలో టీజర్..!
కోలీవుడ్ "నిధి"
'గుర్తుందా శీతాకాలం' - అతిథి పాత్రలో మేఘ
'వకీల్ సాబ్' మెట్రో ప్రయాణం
"వకీల్ సాబ్ "తో సెల్ఫీ
రాజశేఖర్ హెల్త్ పై జీవిత క్లారిటీ
స్వర్గం లా మనాలి అందాలు
నిహారిక పెళ్లి డేట్.. ప్లేస్ ఖరారు..!

"ఈశ్వరన్ " మూవీ షూటింగ్ లో నిధి అగర్వాల్
షూటింగ్ కు కాజల్ గ్రీన్ సిగ్నల్
'తలైవి' లో బరువు వల్ల వెన్ను భాగం దెబ్బతింది
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా సూటిగా మాట్లాడే తత్వం ఆమెది. ఫైర్ బ్రాండ్. అందుకే అప్పుడప్పుడు వివాదాలు కూడా ఆమె వెంట ఉంటూనే ఉంటాయి. ఇదిలా ఉండగా కంగనా ప్రధాన పాత్రలో ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కరోనా వల్ల షూటింగ్ కు కాస్త బ్రేక్ రాగా రీసెంట్ గానే తిరిగి షూటింగ్ ను ప్రారంభించారు.
నా అభిమాన క్రికెటర్ కోహ్లీ హ్యాపీ బర్త్ డే
స్టార్ క్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్.. క్రికెట్ ప్రముఖులు నుండే కాదు సెలబ్రిటీల నుంచి కూడా శుభాకాంక్షలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కోహ్లీకి ట్విటర్ ద్వారా విషెస్ తెలియజేశాడు. `నా అభిమాన క్రికెటర్లలో ఒకరైన విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. భవిష్యత్తులో కూడా మీరు ఇలాగే ఎన్నో రికార్డులు సృష్టిస్తూ భారతదేశం గర్వపడేలా ఆడాలని కోరుకుంటున్నా. రాక్ ఆన్..` అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.
ఇటలీ బీచ్ లో పూజాహెగ్డే
బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం "రాధేశ్యామ్ ", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీస్ లో నటిస్తున్నారు. రెండు బాలీవుడ్ మూవీస్ కు పూజాహెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోషల్ మీడియా లో తన జీవిత విశేషాలను పూజాహెగ్డే అభిమానులతో పంచుకుంటున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మాస్క్ బ్యూటీ తమన్నా
తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ తో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో తమన్నా ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. కరోనా బారిన పడి కోలుకున్న తమన్నా తిరిగి షూటింగ్స్ కు సిద్ధం అయ్యారు. తమన్నా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ ", "గుర్తుందా శీతాకాలం ", బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్ " తెలుగు రీమేక్, "నవంబర్ స్టోరీ "తమిళ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
షూటింగ్స్ తో రాశీఖన్నా బిజీ
తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మోడరన్ డ్రెస్ లతో పాటు ట్రెడిషినల్ డ్రెస్ లలో ఫోటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాశీఖన్నా హీరోయిన్ గా పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
'నారప్ప' షూటింగ్ షురూ త్వరలో టీజర్..!
వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలాక్ డౌన్‌కి ముందే 60 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక రీసెంట్‌గానే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో షూటింగ్ పునఃప్రారంభించింది చిత్రయూనిట్.
'ఆర్ఆర్ఆర్' కోసం ఎదురుచూస్తున్నా అంటున్న హాలీవుడ్ బ్యూటీ..!
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడగా..ఫైనల్ గా ఇటీవలే షూట్ ను స్టార్ట్ చేశారు. ఇక ఇటీవలే ఈ సెట్ లో హాలీవుడ్ నటి.. ఈ సినిమాలో లేడీ స్కాట్ గా చేస్తున్న ఆలిసన్ డూడి అడుగుపెట్టేసింది. బాలీవుడ్ నటి అలియా భట్ కూడా త్వరలోనే సెట్ లో అడుగుపెట్టనుంది.
"బాహుబలి ", "బాహుబలి 2" హిందీ వెర్షన్స్ రీ రిలీజ్
ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో 2 భాగాలుగా రూపొందిన "బాహుబలి " మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ను చాటింది. "బాహుబలి -ది బిగినింగ్ " మూవీ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇన్ ఇండియా , హిందీ భాషలో హైయెస్ట్ గ్రాసింగ్ డబ్బింగ్ మూవీ ఆఫ్ ఇండియా గా రికార్డ్ క్రియేట్ చేసింది.
కోలీవుడ్ "నిధి"
బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ లో నిధి అగర్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జయం రవి హీరోగా రూపొందుతున్న "భూమి "మూవీ తో నిధి కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఆ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే నిధి మరో తమిళ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న తెలుగు మూవీ లో నిధి కథానాయికగా నటిస్తున్నారు.
'గుర్తుందా శీతాకాలం' - అతిథి పాత్రలో మేఘ
నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్లుగా కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాను తెలుగులో గుర్తుందా శీతాకాలం పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ముందు చెప్పినట్టే సింగల్ షెడ్యూల్ లోనే ఈ సినిమా షూట్ ను పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు. దీనిలోభాగంగానే నిర్విరామంగా షూటింగ్ జరుపుతున్నారు.
'వకీల్ సాబ్' మెట్రో ప్రయాణం
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో 'వకీల్ సాబ్' గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించింది చిత్రయూనిట్. ముందు పవన్ లేని షాట్స్ ను కంప్లీట్ చేశారు. పవన్ కు సంబంధించి ఇంకాస్త బ్యాలన్స్ షూట్ మిగిలివుంది. ఇక ఇప్పుడు ఈరోజు నుండి పవన్ కూడా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.
ఒకప్పటి ఈ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?
ఒక సినిమాకు హీరో హీరోయిన్ పాత్రలు ఎంత ముఖ్యమో ఆ సినిమాలో ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టుల పాత్ర కూడా అంతే ముఖ్యం. తెరపై కనిపించే ఎంతోమంది నటీనటులు కలిస్తేనే సినిమా. ఒక్కోసారి సపోర్టింగ్ పాత్రల ద్వారా కూడా హిట్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు మంచి రోల్స్ పడితే ఆరోల్స్ ఆడియన్స్ కు ఎప్పుడూ గుర్తిండిపోతాయి. ఇక ఇప్పుడంటే ఎంతో మంది కొత్త కొత్త వాళ్లు వస్తున్నారు కానీ ఒకప్పుడు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లంటే మనకు వెంటనే కొంతమంది పేర్లు మైండ్ లోకి వచ్చేసేవి. అందులోనూ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే సుధ, హేమ, ప్రగతి, సురేఖ ఇలా కొంతమంది టాప్ లో ఉండేవాళ్ళు. ఇక ఇప్పుడు…
"వకీల్ సాబ్ "తో సెల్ఫీ
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్"మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. "వకీల్ సాబ్ " మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని ఒక స్టూడియో సెట్ లో జరుగుతుంది. హీరో పవన్ కళ్యాణ్ పై కోర్ట్ సన్నివేశాలను దర్శకుడు వేణు తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ స్మార్ట్ లుక్ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. "వకీల్ సాబ్ " మూవీ పోస్టర్స్ , మగువా సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
బిగ్ బాస్ 4 - 'పల్లెకు పోదాం ఛలో ఛలో'
బిగ్ బాస్ 4 - ఇక హాట్ హాట్ గా నామినేషన్ ప్రక్రియ అవ్వడంతో హౌస్ మేట్స్ కాస్త రిలాక్స్ అవుతున్నారు. అది అయ్యేలోపే ఇక ఈరోజు వెంటనే కెప్టెన్సీ టాస్క్ రానే వచ్చింది. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ ఒక యాడ్ ప్రమోషన్ చేయించారు. ఇక అది అయిపోయిన తర్వాత వెంటనే కెప్టెన్సీ టాస్క్ లోకి వెళ్ళిపోయాడు బిగ్ బాస్.
రాజశేఖర్ హెల్త్ పై జీవిత క్లారిటీ
తాజాగా హీరో రాజశేఖర్ కుటుంబం కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. పిల్లలు శివాని, శివాత్మికలు ముందు కరోనా నుండి కోలుకోగా ఇటీవలే జీవిత కూడా రికవరీ అవ్వడంతో ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ఇక ఇదిలా రాజశేఖర్ హెల్త్ పై ఎప్పటికప్పుడు బులెటిన్ విడుదల చేస్తూనే వున్నారు సిటీ న్యూరో ఆసుపత్రి యాజమాన్యం. ఇక పిల్లలు శివాని, శివాత్మిక కూడా సోషల్ మీడియా ద్వారా తమ తండ్రి ఆరోగ్యం గురించి అప్ డేట్స్ ఇస్తూనే వున్నారు. ఇప్పుడు తాజాగా రాజశేఖర్ సతీమణి జీవిత రాజశేఖర్ హెల్త్ గురించి.. ఆయన హెల్త్ పై వస్తున్న వార్తలు గురించి క్లారిటీ ఇచ్చారు.
'అయ్యప్పనుమ్ కోశియనుమ్' రీమేక్ .. పవన్ పక్కన సుదీప్..?
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో విలన్ గా నటించి తన నటనతో అందర్నీ మెప్పించి తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు సుదీప్. కన్నడలో స్టార్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నా.. అప్పుడప్పుడు తెలుగులో కూడా పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూనే వున్నాడు. ఇప్పుడు మరో సినిమాలో కూడా బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తుంది.
స్వర్గం లా మనాలి అందాలు
అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో ప్రస్తుతం కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గానే ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో మొదలైంది. దాదాపు మూడు వారలు అక్కడే నిర్విరామంగా షూటింగ్ చేసుకోనున్నారు. సుదీర్ఘంగా కొనసాగే ఈ షెడ్యూల్లో నాగార్జునతో సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌషల్ నాగ్ కోసం స్టంట్స్ కంపోజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.
నిహారిక పెళ్లి డేట్.. ప్లేస్ ఖరారు..!
మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారికకు గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు చైతన్యకు ఆగస్ట్ 13న నిశ్చితార్దం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగబాబు నిహారిక పెళ్లి గురించి మాట్లాడుతూ.. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నాం..డిసెంబర్ లో పెళ్లి ఉంటుందని... డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే వరుణ్ తేజ్ కొన్ని ప్లేసెస్ ను సెలెక్ట్ చేసి లిస్ట్ తయారు చేసాడు.. పెళ్లి పనుల్లో వరుణ్ బిజీ గా ఉన్నాడని చెప్పిన సంగతి తెలిసిందే కదా.

"ఈశ్వరన్ " మూవీ షూటింగ్ లో నిధి అగర్వాల్
బిజినెస్ మేనేజ్ మెంట్ లో గ్రాడ్యుయేట్ అయిన నిధి అగర్వాల్ బాలెట్ , కథక్ , బెల్లీ డ్యాన్స్ లలో ట్రైనింగ్ పొందారు. "మున్నా మైఖేల్ "బాలీవుడ్ మూవీ తో కెరీర్ ప్రారంభించిన నిధి "సవ్యసాచి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నిధి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు లో ఒక మూవీ లో నటిస్తున్న నిధి "జేమ్స్ " మూవీ తో శాండల్ వుడ్ ,"భూమి " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఇప్పుడు నిధి మరో తమిళ మూవీ లో కథానాయిక గా ఎంపిక అయ్యారు.
షూటింగ్ కు కాజల్ గ్రీన్ సిగ్నల్
తెలుగు , తమిళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు భాషల మూవీస్ లో కాజల్ బిజీగా ఉన్నారు. కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు ", "ఇండియన్ 2", "హే సినామికా "(తమిళ ), "ముంబై సాగా (హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "క్వీన్ " మూవీ తమిళ రీమేక్ కాజల్ ప్రధాన పాత్రలో రూపొందిన "ప్యారిస్ ప్యారిస్ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.