బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీస్ లో నటిస్తున్నారు. రెండు బాలీవుడ్ మూవీస్ కు పూజాహెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోషల్ మీడియా లో తన జీవిత విశేషాలను పూజాహెగ్డే అభిమానులతో పంచుకుంటున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ ” మూవీ షూటింగ్ ఇటలీ లో జరిగింది. ఇటలీ షూటింగ్ షెడ్యూల్ ను ముగించుకుని “రాధేశ్యామ్ ” మూవీ టీమ్ ఇండియా కు చేరుకుంది . హైదరాబాద్ లో జరిగే షూటింగ్ షెడ్యూల్ తో “రాధేశ్యామ్ ” మూవీ టోటల్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. ఇటలీ లోని బీచ్ లో అందాలను ఆస్వాదిస్తున్న తన ఫోటోలను పూజాహెగ్డే చల్లటి నీరు , గాలి , వెచ్చనైన అనుభూతి అంటూ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోలు ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: