మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారికకు గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు చైతన్యకు ఆగస్ట్ 13న నిశ్చితార్దం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగబాబు నిహారిక పెళ్లి గురించి మాట్లాడుతూ.. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నాం..డిసెంబర్ లో పెళ్లి ఉంటుందని… డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే వరుణ్ తేజ్ కొన్ని ప్లేసెస్ ను సెలెక్ట్ చేసి లిస్ట్ తయారు చేసాడు.. పెళ్లి పనుల్లో వరుణ్ బిజీ గా ఉన్నాడని చెప్పిన సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు తాజాగా నిహారిక పెండ్లి ఏ రోజు, ఎక్కడ అనే దానిపై క్లారిటీ వచ్చింది. డిసెంబర్ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి జరగనుందట. ఒబెరాయ్ గ్రూప్ ఈ ప్యాలెస్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ఇదిలా ఉండగా ఇదే ప్యాలెస్ లో టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం కూడా జరిగింది.
ఇక నిశితార్థం రోజున ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. ఇక ఇప్పుడు పెళ్లికి కూడా ఇరుకుంటుంబ సభ్యులు వారికి అత్యంత సన్నిహితులు, ఇండస్ట్రీకి చెందిన కొద్దిమంది ప్రముఖుల సమక్షంలో వివాహ వేడుకకు నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్టు టాక్. పెళ్లి తర్వాత ఇక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. చూద్దాం మరి ఎం జరుగుతుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: