షూటింగ్స్ తో రాశీఖన్నా బిజీ

Raashi Khanna Gets Busy With Back To Back Movie Shootings

తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మోడరన్ డ్రెస్ లతో పాటు ట్రెడిషినల్ డ్రెస్ లలో ఫోటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాశీఖన్నా హీరోయిన్ గా పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా కారణంగా నిలిచిపోయిన మూవీ షూటింగ్స్ పునః ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. హీరోయిన్ రాశీఖన్నా ఇప్పుడు రెండు తమిళ మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోబ్యానర్ పై విజయ్ సేతుపతి హీరోగా ఢిల్లీ ప్రసాద్ దీన దయాళన్ దర్శకత్వంలో “తుగ్లక్ దర్బార్ “తమిళ మూవీ రూపొందుతుంది. విజయ్ సేతుపతి కి జోడీగా నటిస్తున్న రాశీఖన్నా ఆమూవీ షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసి మరో తమిళ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సుందర్ సి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ “అరన్ మణై 3 “మూవీ షూటింగ్ లో రాశీఖన్నా పాల్గొంటున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ తో రాశీఖన్నా బిజీగా ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.