కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 25

సినిమా వార్తలు

అబ్బాయిలు అందరూ ఇంట్లోనే అంటున్న నమ్రత

సూపర్‌స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. మహేష్ గురించి కానీ, పిల్లలు సితార-గౌతమ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలు ఆసక్తికర విషయాలగురించి ఏదో ఒకటి తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు. ఇప్పుడు రోజుకో పోస్ట్ అయినా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఈ మధ్య అయితే పాత ఫొటోలను కూడా పోస్ట్ చేస్తూ గత స్మృతులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ ఫొటోను తన ఇన్స్టాలో పంచుకుంది నమ్రత

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

చితక్కొట్టుడు 2 - గోష్ట్ వెర్ష‌న్ 2.0 టీజ‌ర్ రిలీజ్

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంతోష్ పి జ‌య‌కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం చిత‌క్కొట్టుడు 2. దర్శకత్వంతో పాటు ఈ సినిమాలో హీరోగా కూడా నటిస్తున్నాడు సంతోష్. త‌మిళ సినిమా ఇరాండ‌మ్ కూతుత్తు కి తెలుగు వెర్ష‌న్ గా చిత‌కొట్ట‌డు 2 రాబోతుంది. గ‌తంలో సంతోష్ పి జ‌య‌కుమార్ త‌మిళంలో తెరకెక్కించిన ఇర‌త్తు అరియిల్ మురత్తు కూత్తు, గ‌జ‌నీకాంత్ వంటి సినిమాలు క‌మ‌ర్షీయ‌ల్ సూప‌ర్ హిట్స్ గా నిలిచాయి. ఈ నేప‌థ్యంలో చిత‌కొట్ట‌డు 2 ని గ‌తంలో వ‌చ్చిన అడ‌ల్ట్ హ‌రర్ కామెడీ ల కంటే మరింత ఎంట‌ర్ టైనింగ్ గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నారు దర్శకుడు సంతోష్ పి జ‌య‌కుమార్.

TFN Adminవాట్సాప్
సాంగ్

'కేస్‌ 99' రానున్న 'టిక్ టిక్ టిక్' సాంగ్

నిఖిల్‌ ,అనువర్ణ ప్రధాన పాత్రల్లో ప్రియదర్శిని రామ్‌ నటించి దర్శకత్వం వహించిన చిత్రం 'కేస్‌ 99'. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన దౌర్జన్యానికి మానవసంబంధాలే కారణమని అందరూ ఆలోచిన్తున్న నేపథ్యంలో ఆ ఘటనల ఆధారంగా డైరెక్టర్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ ఫైల్ అంటూ ఒక చిన్న టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Middle Class Melodies Motion Poster Is Out
ఫస్ట్ లుక్

'మిడిల్ క్లాస్ మెలోడీస్' మోషన్ పోస్టర్ రిలీజ్

'వి', నిశ్శబ్దం, రీసెంట్ గా మిస్ ఇండియా సినిమాలు ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. అది `మిడిల్ క్లాస్ మెలోడీస్‌`. ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా వినోద్ అనంతోజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా `మిడిల్ క్లాస్ మెలోడీస్‌`. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను కూడా అమెజాన్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ నెల నవంబర్ 20వ తేదీన ఈ సినిమాను అమెజాన్ లో రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Tollywood Hero Ram Pothineni Shares His New Look Pictures On Social Media
సినిమా వార్తలు

ఫ్రెష్ లుక్ లో హీరో రామ్

"దేవదాసు ", "రెడీ ", "కందిరీగ ", "పండగ చేస్కో ", "నేను శైలజ ", "హలో గురు ప్రేమకోసమే " వంటి సూపర్ హిట్ మూవీస్ లో రామ్ పోతినేని తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను అలరించారు. చాక్లెట్ బాయ్ లా ఉండే హీరో రామ్ బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ లో మాస్ క్యారెక్టర్ లో పక్కా హైదరాబాదీ యువకుడిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "RED " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
Actress Anushka Shetty Birthday CDP Is Out.
సినిమా వార్తలు

అనుష్క బర్త్ డే సీడీపీ రిలీజ్

తెలుగు , తమిళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అనుష్క స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. మొదట గ్లామర్ పాత్రలలో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుష్క తరువాత లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు శ్రీకారం చుట్టారు. "అరుంధతి "రుద్రమ దేవి ", "భాగమతి "వంటి సూపర్ హిట్ మూవీస్ లో అనుష్క అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలతో పాటు బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. "సైరా నరసింహారెడ్డి "మూవీ లో ఝాన్సీ లక్ష్మీ బాయ్ గా అతిథి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
Bigg Boss Telugu 4 Highlights: Amma Rajasekhar Becomes House Captain
బిగ్ బాస్

బిగ్ బాస్4 - కెప్టెన్ గా అమ్మ రాజశేఖర్

బిగ్ బాస్4 ప‌ల్లెకు పోదాం ఛ‌లో ఛ‌లో' టాస్కులో భాగంగా హారిక కెప్టెన్సీ పోటీకి అర్హత పొందగా.. అమ్మ రాజశేఖర్ కు గతవారం నాగార్జున డైరెక్ట్ గా కెప్టెన్సీ పోటీకి అర్హత కలిగించారు. ఇక మూడో కంటెండర్ గా అరియానా ఎంపిక అవ్వగా వారి ముగ్గురికి కెప్టెన్సీ టాస్క్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. "రింగులో రంగు" అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఇందులో హారిక‌, అరియానా, అమ్మ రాజ‌శేఖ‌ర్ రింగులో క‌ళ్ల‌కు గంత‌లు కట్టుకుని ఉంటారు. చేతిని రంగులో ముంచి ఒక‌రికి మ‌రొక‌రు అంటించుకోవాలి. ఈ టాస్కులో మాస్ట‌ర్ హారిక మీద.. అరియానా మీద రంగు పూర్తిగా రాయడంతో అస‌లు రంగు ప‌డ‌కుండా త‌ప్పించుకున్న అమ్మ రాజ‌శేఖ‌ర్ కెప్టెన్ అయ్యాడు.

TFN Adminవాట్సాప్
'బ్రీత్ ఆఫ్ నాంది' టీజర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

'బ్రీత్ ఆఫ్ నాంది' టీజర్ రిలీజ్

విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. లాక్ డౌన్ ముందే 80 శాతం షూటింగ్ పూర్త‌యింది. ఇక కరోనా వల్ల ఎక్కడి షూటింగ్ లు అక్కడ ఆగిపోవడంతో ఈ సినిమా షూట్ కు కూడా బ్రేక్ పడింది. రీసెంట్ గానే మళ్ళీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుతున్నారు.

TFN Adminవాట్సాప్
I have finished watching all episodes bigg boss in just 3 days says Samantha Akkineni
బిగ్ బాస్

మూడు రోజులల్లో బిగ్ బాస్ ఎపిసోడ్స్ మొత్తం చూశా

బాగ్ బాస్ 4 కి నాగార్జున హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇటీవల వైల్డ్ డాగ్ షూటింగ్ లో భాగంగా నాగార్జున ఒక వారం ఆ భాద్యతలు కోడలు సమంతకి అప్పజెప్పిన సంగతి కూడా తెలుసు కదా. ఇక మొత్తానికి మామకు తగ్గ కోడలు అనిపించుకుంది ఈ షో కి హోస్ట్ గా చేసి. అంతేకాదు సమంత వచ్చిన షోకి టీఆర్పీ రేటింగ్ కూడా ఒక రేంజ్ లోనే వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

స్పెషల్ రోల్ లో హీరో నాని

హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. "టక్ జగదీష్ " మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ తరువాత నాని, దర్శకులు రాహుల్ సంక్రుత్యన్ , వివేక్ ఆత్రేయ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Actress Rashmika Mandanna Shares Her Latest Picture On Instagram With A Funny Caption.
సినిమా వార్తలు

"అయ్యో రామా "- రష్మిక

"ఛలో ", గీత గోవిందం", "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ" వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో అగ్ర తార గా రాణిస్తున్న రష్మిక "సుల్తాన్ "మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశిస్తున్నారు. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం "పుష్ప "మూవీ లో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తున్నారు. ఈ మూవీ లోని తన పాత్ర కై రష్మిక రాయలసీమ స్లాంగ్ ను నేర్చుకున్నారు. శర్వానంద్ "ఆడాళ్ళూ మీకు జోహార్లు " మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Jersey Fame Shraddha Srinath To Come Back With A Horror Thriller Movie Titled Kaliyugam
సినిమా వార్తలు

శ్రద్ధా శ్రీనాథ్ 'కలియుగం'

'జెర్సీ' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది శ్రద్ధ. ఆ సినిమాలో శ్రద్ధా.. తన నటనతో అదరగొట్టింది. ఇటీవలే తెలుగులో నటించిన 'కృష్ణ అండ్ హిజ్‌ లీల' మూవీ ఓటీటీలో రిలీజ్‌అయింది. ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక తెలుగులోనే కాకుండా అటు కన్నడ, తమిళ సినిమాలు చేస్తోంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'మాస్టర్' టీజర్, ట్రైలర్ అప్పుడే రిలీజ్ చేయలేం

నగరం, ఖైదీ చిత్రాల దర్శకుడు లొకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మాస్టర్‌'. సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో విజయ్ 'మాస్టర్' సినిమా కూడా ఒకటని చెప్పొచు. ఎందుకంటే కేవలం తమిళ్ లోనే కాదు విజయ్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. కరోనా వల్ల థియేటర్స్ మూత పడటంతో సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకున్న ఈ సినిమా థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు రిలీజ్ కు సిద్ధంగా వుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కాజల్ పెళ్ళి ఫొటోలలో హైలైట్

టాలీవుడ్ , కోలీవుడ్ లలో బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు భాషల మూవీస్ లో కాజల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల మూవీస్ తో పాటు యంగ్ హీరోల మూవీస్ లో కూడా నటిస్తూ కాజల్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య ", విష్ణు మంచు "మోసగాళ్ళు ", కమల్ హాసన్ "ఇండియన్ 2 ", దుల్కర్ సల్మాన్ "హే సనామికా "(తమిళ ), "ముంబై సాగా "(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

"వసంత కోకిల " టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

తెలుగు , తమిళ వెర్షన్స్ లో రూపొందిన సక్సెస్ ఫుల్ "లవ్ ఫెయిల్యూర్ "మూవీ తో బాబీ సింహా కెరీర్ ప్రారంభించారు. పలు తమిళ మూవీస్ లో ప్రతినాయకుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించారు. "జిగర్తాండ " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బాబీ సింహా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నేషనల్ , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. "రన్" , "ఏదైనా జరగొచ్చు" , "డిస్కో రాజా " మూవీస్ తో బాబీ సింహా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

గుడ్‌బై 'వైల్డ్‌డాగ్' - చాలా బాధగా ఉంది

అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో ప్రస్తుతం కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కోసం‌ హిమాలయాస్‌ కు వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు హిమాచ‌ల్ ప్రదేశ్‌లో మ‌నాలీలో షూటింగ్ జరుపుకుంది. అక్కడికి వెళ్ళినప్పుడే నాగ్ దాదాపు మూడు వారాలపాటు షూటింగ్ జరుపుకోనున్నట్టు తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇక చెప్పినట్టే తన షూటింగ్ ను పూర్తిచేసుకున్నాడు. ఇక ఈ విషయాన్ని నాగ్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. "వైల్డ్‌డాగ్‌లో నా పాత్ర చిత్రీకరణ ఈరోజుతో పూర్తయ్యింది. ఇంటికి బయలుదేరాను. నా టాలెంటెడ్‌ టీమ్‌కు, హిమాలయాస్‌కు గుడ్‌బై చెబుతున్నందుకు చాలా…

TFN Adminవాట్సాప్
Gatham Review: An Edge Of The Seat Physcological Thriller
రివ్యూ

గతం రివ్యూ - సూపర్ సైకలాజికల్ థ్రిల్లర్

ఇక ఫైనల్ గా చెప్పాలంటే థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు మాత్రమే కాకుండా.. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

విజువల్ వండర్ గా "రాధేశ్యామ్ "

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ "మూవీ రూపొందుతుంది. భాగ్యశ్రీ , ప్రియదర్శి , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా "రాధేశ్యామ్ "మూవీ ఇటలీ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది.

Team TFNవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - అరియానా పై అవినాష్ ఫైర్

బిగ్ బాస్ 4 - మొన్న ఇచ్చిన 'ప‌ల్లెకు పోదాం ఛ‌లో ఛ‌లో' టాస్క్ నిన్న కూడా అదే కొనసాగింది. ఒకరకంగా నిన్న కంప్లీట్ అవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఆడియన్స్. ఇక నిన్న ఎపిసోడ్ లో స్టార్టింగే త‌న‌కు ఆమ్లెట్ కావాల‌ని అరియానా కోర‌గా కుద‌ర‌ద‌ని అభిజిత్ చెప్పాడు. దీంతో ప్ర‌తిసారి ఆహారం దగ్గరే టాస్క్ ఆపేస్తారని.. ఇందుకే, నీ గేమ్ న‌చ్చ‌ద‌ని అభిజిత్‌ను ముఖం ప‌ట్టుకుని అనేసింది. దీంతో అభి.. తెలుసుకుని మాట్లాడు అంటూ సీరియ‌స్ అయ్యాడు. ఇక‌ అరియానా తరపున అమ్మ రాజశేఖర్ కిచెన్ లోకి వెళ్లి ఆమ్లెట్ కావాలని అడగగా దానికి అభి ఆమ్లెట్ ఇవ్వాలంటే ఇంకా ఎక్కువ బియ్యం ఇవ్వాలని చెప్పడంతో మోనాల్ ప్లేటులో ప‌ట్టుకున్న‌…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నెటిజెన్ కామెంట్ - సామ్ కౌంటర్

సెలబ్రిటీస్ కు నెటిజన్స్ కామెంట్స్ చేయడం.. వాటికి సెలబ్రిటీస్ కౌంటర్ లు ఇవ్వడం కామన్ థింగ్. ఒక్కోసారి నెటిజన్స్ కు సెలెబ్రిటీస్ కు సోషల్ మీడియా వేదికగా వర్డ్స్ వారే జరుగుతుంది. ఇక టాలీవుడ్ సమంతకు కూడా కామెంట్స్ కౌంటర్లు కొత్తేమి కాదు. ఇప్పటికే చాలామంది నెటిజన్స్ కు తన కౌంటర్ లతో షాకిచ్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇక తాజాగా మరోసారి అలాంటి సంఘటనే ఎదురైంది.

TFN Adminవాట్సాప్

షేర్