‘తలైవి’ లో బరువు వల్ల వెన్ను భాగం దెబ్బతింది

Kangana Ranaut Speaks How Heavy Weight Brought Her Spinal Issue Problem While Shooting For Thalaivi Movie

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా సూటిగా మాట్లాడే తత్వం ఆమెది. ఫైర్ బ్రాండ్. అందుకే అప్పుడప్పుడు వివాదాలు కూడా ఆమె వెంట ఉంటూనే ఉంటాయి. ఇదిలా ఉండగా కంగనా ప్రధాన పాత్రలో ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కరోనా వల్ల షూటింగ్ కు కాస్త బ్రేక్ రాగా రీసెంట్ గానే తిరిగి షూటింగ్ ను ప్రారంభించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం కంగనా 20 కిలోల బ‌రువు పెరిగానని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. నా పాత లుక్ లో మారాల్సి ఉంది. అప్ప‌టి లుక్‌, చురుకుద‌నం, మెటాబాలిజాన్ని అల‌వాటు చేసుకోవాలి అంటూ ఇటీవలే తన ట్విట్టర్ లో ఫొటోలు పోస్ట్ చేసి చెప్పింది. ఇక ఇప్పుడు మరోసారి లావు పెరగడం వల్ల తనకు వచ్చిన ప్రాబ్లం గురించి చెపుతూ ట్వీట్ చేసింది. సూపర్ హ్యూమన్ గర్ల్ పాత్రలో నటిస్తున్నాను.. 30 ఏళ్ళ వయసులో మరో 20 కేజీలు పెరిగాను అంతేకాకుండా అంత బరువు పెరిగాక భరత నాట్యం చేయడం వల్ల తన వెన్ను భాగం దెబ్బతిందని ఆమె ట్వీట్ చేసింది. అనంతరం ఆ బరువును తగ్గించుకోవడానికి చాలా కష్టపడ్డానని చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది.

 

కాగా ఇంకా ఈ సినిమాలో అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. విష్ణు వర్ధన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌తో కలిసి విబ్రీ మోషన్‌ పిక్చర్స్‌, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − ten =