స్టార్ క్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్.. క్రికెట్ ప్రముఖులు నుండే కాదు సెలబ్రిటీల నుంచి కూడా శుభాకాంక్షలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కోహ్లీకి ట్విటర్ ద్వారా విషెస్ తెలియజేశాడు. `నా అభిమాన క్రికెటర్లలో ఒకరైన విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. భవిష్యత్తులో కూడా మీరు ఇలాగే ఎన్నో రికార్డులు సృష్టిస్తూ భారతదేశం గర్వపడేలా ఆడాలని కోరుకుంటున్నా. రాక్ ఆన్..` అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wishing one of my favourite cricketers, @imVkohli a very happy birthday!! May you continue to set new records and make India proud😊 Rock On!! pic.twitter.com/v6NcJWcbjv
— Mahesh Babu (@urstrulyMahesh) November 5, 2020
ఇక ఇదిలా ఉండగా లాక్ డౌన్ లో సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఇంట్లో పిల్లలు గౌతమ్-సితార తో చేసే అల్లరి, ఆట పాటలకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉన్నారు. అంతేకాదు కరోనా గురించి అవగాహన కూడా కలిపిస్తూ పలు సూచనలు, సందేశాలు కూడా ఇస్తున్నారు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: