బిగ్ బాస్ 4 – ‘ప‌ల్లెకు పోదాం ఛ‌లో ఛ‌లో’

Contestants Are Assigned With A Unique Captaincy Task In Bigg Boss Telugu 4 Latest Episode

బిగ్ బాస్ 4 – ఇక హాట్ హాట్ గా నామినేషన్ ప్రక్రియ అవ్వడంతో హౌస్ మేట్స్ కాస్త రిలాక్స్ అవుతున్నారు. అది అయ్యేలోపే ఇక ఈరోజు వెంటనే కెప్టెన్సీ టాస్క్ రానే వచ్చింది. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ ఒక యాడ్ ప్రమోషన్ చేయించారు. ఇక అది అయిపోయిన తర్వాత వెంటనే కెప్టెన్సీ టాస్క్ లోకి వెళ్ళిపోయాడు బిగ్ బాస్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక బిగ్‌బాస్‌ ఈ వారం కెప్టెన్సీ కోసం “ప‌ల్లెకు పోదాం ఛ‌లో ఛ‌లో” అనే టాస్కు ఇచ్చాడు. ఈ టాస్కులో ప్ర‌ధాన‌మైన‌ది మండే మంట‌ను ఆర‌కుండా చూ‌డటం. ఇక గ్రామ‌పెద్ద‌గా సోహైల్‌ను, అత‌డి భార్య‌గా లాస్య‌, వీరి కూతురిగా అరియానా‌ను నియ‌మించాడు. త‌ల్లీకూతుళ్ల‌కు అమ్మ రాజ‌శేఖ‌ర్‌ కష్టపడే గ్రామస్థుడు. గ్రామపెద్ద భార్యను అట్రాక్ట్ చేయాలి. అవినాష్ పాన్ షాప్ యజమాని. అరియానాను ఇష్టపడే వ్యక్తి. మెహబూబ్ అవినాష్ తమ్ముడు.. ఆ ఊరిలో రౌడీగా ఉండే పాత్ర. బాధ్య‌త లేని గ్రామ‌స్థుడిగా, లాస్య‌ త‌‌మ్ముడిగా అఖిల్ పాత్ర పోషించాడు. అభి, మోనాల్ వంట‌మ‌నుషులుగా మారిపోయారు. వీరికి మిగ‌తావారు వ‌డ్ల‌ను దంచి చెరిగిన బియ్యం ఇస్తేనే ఆహారం ఇస్తారు. పుకార్లు పుట్టించే అమ్మాయిగా హారిక పేరును చెప్తూ ఆమెకు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. రాజ‌శేఖ‌ర్‌పై కాఫీ చ‌ల్ల‌డం, అవినాష్‌కు కోపం తెప్పించి అరిచేలా చేయ‌డం, చంపాల‌నుకునే వ్య‌క్తి పేరు లిప్‌స్టిక్‌తో పేరు రాయ‌డం వంటి మూడు హ‌త్య‌లు హారిక చేయాల్సి ఉంటుంది. మెహ‌బూబ్ రౌడీయిజం చేస్తూ హారిక‌ వెంట పడుతుంటాడు.

ఇక బజర్ మోగగానే ఎవరి టాస్క్ లో వారు మునిగిపోయారు. సోహైల్, లాస్య మధ్య అమ్మ రాజశేఖర్ గొడవ పెట్టె ప్రయత్నం చేసాడు. మెహబూబ్ కూడా సీరియస్ గా ఉంటూ.. కామెడీగా ఉంటూ బాగానే చేసాడు. మరోపక్క ‌ అరియానాను బుట్ట‌లో వేసేందుకు నానాప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు అవినాష్. అది చూసిన అరియానా తండ్రి సోహైల్ ఆగ్రహం వ్యక్తం చేసి ఇంకోసారి ఇలా చేస్తే ఊరి నుండి బహిష్కరణ చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. టాస్క్ లో భాగంగా అఖిల్ అల‌గ‌డంతో సోహైల్ వెళ్లి బుజ్జ‌గించాడు. అయినా స‌రే అఖిల్ క‌నీసం స్పందించ‌కుండా అక్క‌డి వెళ్ళిపోయాడు. ఇక ఎవరి పనిలో వాళ్ళు ఉండగా సీక్రెట్ టాస్క్ ఇచ్చిన హారిక మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది. మెహ‌బూబ్‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతూ.. పుకార్లు పుట్టిస్తూ.. ఫైనల్ గా ఒక సీక్రెట్ టాస్క్ ను పూర్తి చేసింది.

ఇక నిన్నటి వరకూ అయితే సో సో గానే సాగింది ఈ టాస్క్.. మరి ఈ రోజు కాస్త సీరియస్ అవుతున్నట్టే కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.. ఎవరు కెప్టెన్సీ టాస్క్ కోసం ఎంపిక అవుతారో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 14 =