ఒకప్పటి ఈ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?

Do You Know This Well Known Yesteryear Charecter Artist

ఒక సినిమాకు హీరో హీరోయిన్ పాత్రలు ఎంత ముఖ్యమో ఆ సినిమాలో ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టుల పాత్ర కూడా అంతే ముఖ్యం. తెరపై కనిపించే ఎంతోమంది నటీనటులు కలిస్తేనే సినిమా. ఒక్కోసారి సపోర్టింగ్ పాత్రల ద్వారా కూడా హిట్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు మంచి రోల్స్ పడితే ఆరోల్స్ ఆడియన్స్ కు ఎప్పుడూ గుర్తిండిపోతాయి. ఇక ఇప్పుడంటే ఎంతో మంది కొత్త కొత్త వాళ్లు వస్తున్నారు కానీ ఒకప్పుడు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లంటే మనకు వెంటనే కొంతమంది పేర్లు మైండ్ లోకి వచ్చేసేవి. అందులోనూ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే సుధ, హేమ, ప్రగతి, సురేఖ ఇలా కొంతమంది టాప్ లో ఉండేవాళ్ళు. ఇక ఇప్పుడు పైన ప్రశ్నకు ఈ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరబ్బా అని ఆలోచలలో పడే ఉంటారు. ఆమె ఎవరో కాదు ఢిల్లీ రాజేశ్వరి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఢిల్లీ రాజేశ్వరి తెలుగు సినిమా నటి. ఈమె దేశ రాజధాని ఢిల్లీలో పుట్టి పెరగడం వల్ల ఢిల్లీ రాజేశ్వరిగా టాలీవుడ్లో ముద్ర పడిపోయింది. తెలుగులో పలు చిత్రాల్లో అమ్మగా, అత్తగా అలరించింది నటి ఢిల్లీ రాజేశ్వరి. క్యారెక్టర్ ఆర్టిస్టులలో ‘ఢిల్లీ రాజేశ్వరి ‘ ది ఓ ప్రత్యేకశైలి. డిల్లీలో పుట్టి పెరిగి పోస్టుగ్రాడ్యుయేషన్ చేస్తూ నృత్యాన్ని అభ్యసించిన రాజేశ్వరి అస్సాం లో టీచర్ గా పనిఛేసారు. సినిమాల్లోకి రాకముందు దూరదర్శన్ లో వచ్చే గణపతి సీరియల్ ఒక పాత్ర వేసారు. ఆ తర్వాత కృష్ణవంశీ ద్వారా “అంత:పురం” సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆతర్వాత సముద్రం, ఇంద్ర, చిత్రం, నువ్వేకావాలి, డీ, ఖుషీ ఖుషీగా, కార్తీకమాసం, చక్రం ఇలా దాదాపు చాలా సినిమాల్లో నటించారు. ఇక ఈమె శేషసాయిప్రసాద్‌ను వివాహం చేసుకుని ప్రస్తుతం సినిమాలకు దూరంగానే వున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one − 1 =