బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో నిధి అగర్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జయం రవి హీరోగా రూపొందుతున్న “భూమి “మూవీ తో నిధి కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఆ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే నిధి మరో తమిళ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న తెలుగు మూవీ లో నిధి కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేషనల్ అవార్డ్ విన్నర్ సుశీంద్రన్ దర్శకత్వంలో స్టార్ హీరో శింబు కథానాయకుడిగా “ఈశ్వరన్ “తమిళ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో నిధి , శింబుకు జోడీగా నటిస్తున్నారు. “ఈశ్వరన్ ” మూవీ షూటింగ్ మదురై లో జరుగుతుంది. 7 నెలల తరువాత నిధి షూటింగ్ లో పాల్గొన్నారు. లాక్ డౌన్ సమయంలో తమిళ భాషను నేర్చుకున్న నిధి మాట్లాడుతూ .. తమిళ భాషను నేర్చుకొనడం ఆనందంగా ఉందనీ , డైలాగ్స్ అర్ధం చేసుకొనడానికి , ఇతరులతో కమ్యూనికేట్ అవడానికి , మాట్లాడడానికి అనువుగా ఉందనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: