స్వర్గం లా మనాలి అందాలు

Nagarjuna Akkineni Shares His Memories Of Being At Manali On Twitter

అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో ప్రస్తుతం కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గానే ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాచ‌ల్ ప్రదేశ్‌లోని మ‌నాలీలో మొద‌లైంది. దాదాపు మూడు వారలు అక్కడే నిర్విరామంగా షూటింగ్ చేసుకోనున్నారు. సుదీర్ఘంగా కొన‌సాగే ఈ షెడ్యూల్‌లో నాగార్జునతో స‌హా ప్రధాన పాత్రధారుల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌషల్ నాగ్ కోసం స్టంట్స్ కంపోజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా అక్కడికి వెళ్లిన దగ్గర నుండి అక్కడి ప్రకృతి దృశ్యాలను నాగ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలుపుతూనే వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రోహ్ తంగ్ పాస్ నుంచి ఓ వీడియో పోస్ట్ చేయ‌డంతోపాటు హిమాల‌యాల్లో వైల్డ్ డాగ్ టీం లొకేష‌న్ ఫొటోల‌ను షేర్ చేయగా తాజాగా మ‌రో అంద‌మైన స్టిల్ ను నాగార్జున ట్విట‌ర్ లో షేర్ చేశాడు. హిమాల‌యాల్లోని లొకేష‌న్ లో సూర్య‌కిర‌ణాలు ప‌డుతున్న ఫొటోను నాగార్జున షేర్ చేస్తూ… స్వ‌ర్గం కిందికి దిగిన‌ట్టుగా హిమాల‌యాల్లో సూర్యాస్త‌మం అంటూ..ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఈ ఫొటో నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

కాగా య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజ‌య్ వ‌ర్మగా నాగార్జున నటిస్తున్నాడు. నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న స‌యామీ ఖేర్, అలీ రెజా, మ‌యాంక్ ప్ర‌కాశ్ ప‌లువురు నటీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి షానీల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − seventeen =