
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 27

శాకాహారి గానే కొనసాగుతా -రకుల్ ప్రీత్ సింగ్
ఎడిటర్ కోలా భాస్కర్ ఇక లేరు
"రాధేశ్యామ్ "ఇటలీ షూటింగ్ షెడ్యూల్ పూర్తి
'ఆచార్య' కూడా రెడీ అవుతున్నాడు

మిస్ ఇండియా మూవీ ట్విట్టర్ టాక్
స్మార్ట్ లుక్ లో పవన్ కళ్యాణ్
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "మన్మథుడు "
అప్పుడు క్రష్ - ఇప్పుడు అమ్మ
ఫ్యాన్ కు మాటిచ్చిన ఎన్టీఆర్
పిక్చర్ పర్ఫెక్ట్.. యాదృచ్చికం అనేది అసాధారణం
క్యాచీ టైటిల్ తో నాగశౌర్య ?
హీరో రామ్ కు మరోసారి జోడీగా అనుపమ పరమేశ్వరన్ ?
మరో సినిమాకు రెడీ అయిన రాజ్ తరుణ్
గోదావరి యాస నేర్చుకుంటున్న సుధీర్ బాబు
హైదరాబాద్ లో "ఖిలాడి "
'తలైవి' పొలిటికల్ ఎపిసోడ్స్ కు వీఎఫ్ఎక్స్

2021 జనవరి నుండి 'సర్కారు వారి పాట'..!
ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాతో ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అయిపోయాడు. అయితే తెలిసిందే కదా కరోనా వల్ల అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయని. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టలేకపోయారు. అయితే ఈ మధ్యనే షూటింగ్ లు మొదలుపెట్టారు. చాలా సినిమాలు చివరిదశలోనే ఉండగా ముందు వారు మాత్రం షూటింగ్ లను మొదలుపెట్టి పూర్తి చేసుకున్నారు.
శాకాహారి గానే కొనసాగుతా -రకుల్ ప్రీత్ సింగ్
తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఫిట్ నెస్ కు ప్రాధాన్యమిస్తూ రకుల్ సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రకుల్ ప్రస్తుతం 2 హిందీ , "ఇండియన్ 2 "(తమిళ ), నితిన్ హీరోగా రూపొందుతున్న "చెక్ "మూవీ లో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ జంటగా రూపొందిన మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
ఎడిటర్ కోలా భాస్కర్ ఇక లేరు
సూపర్ "హిట్ ఖుషి "మూవీ తో టాలీవుడ్ కు ఎడిటర్ గా పరిచయం అయిన కోలా భాస్కర్ "7జి బృందావన్ కాలనీ ", "ఆడవారిమాటలకు అర్ధాలే వేరులే "వంటి సూపర్ హిట్ మూవీస్ కు ఎడిటర్ గా పనిచేశారు. దర్శకుడు సెల్వ రాఘవన్ మూవీస్ , స్టార్ హీరో విజయ్ నటించిన పలు తమిళ మూవీస్ కు ఎడిటర్ గా పనిచేసిన కోలా భాస్కర్ తన తనయుడు బాలకృష్ణ ను కోలీవుడ్ కు పరిచయం చేస్తూ "మాలై నేరత్తు మయక్కం " మూవీ ని నిర్మించారు.
"రాధేశ్యామ్ "ఇటలీ షూటింగ్ షెడ్యూల్ పూర్తి
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా ఇటలీ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ "మూవీ తెలుగు , హిందీ భాషలలో రూపొందుతుంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ , ప్రియదర్శి , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
'ఆచార్య' కూడా రెడీ అవుతున్నాడు
టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలు ఇప్పటికే షూటింగ్ లు మొదలు పెట్టారు. కొంతమంది మిగిలిఉన్న షూటింగ్ భాగాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఇక అగ్ర హీరోల్లో నాగార్జున అయితే ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టారు . అది కూడా ఇక్కడ కాదు మనాలిలో ప్రస్తుతం వైల్డ్ డాగ్ షూట్ లో వున్నారు. ఇక ఇప్పుడు చిరు కూడా సెట్స్ పైకి రావడానికి సిద్ధమవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ కనుక లేకపోతే దసరా, దీపావళి సీజన్ లోనే విడుదలై ఉండేది.

'మిస్ ఇండియా' రివ్యూ - మహిళా సాధికారితను తెలిపే సినిమా
ఫైనల్ గా చెప్పాలంటే ఆడవాళ్లు ఏ విషయంలో తక్కువ కాదు... వాళ్లు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అనేదే `మిస్ ఇండియా` కథ. బిజినెస్ వార్ లాంటి సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

మిస్ ఇండియా మూవీ ట్విట్టర్ టాక్
Watched #MissIndia @KeerthyOfficial Amazing! Performance by Keerthy garu as Samyuktha. It's difficult to even imagine other actress in this role @MusicThaman…
స్మార్ట్ లుక్ లో పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు , బోనీ కపూర్ నిర్మాతలుగా రూపొందుతున్న కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ "మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. హీరో పవన్ కళ్యాణ్ పై కోర్ట్ సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. శృతి హాసన్ కథానాయిక కాగా అంజలి , నివేద థామస్, అనసూయ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

బిగ్ బాస్4 - 9వ వారం నామినేషన్ లిస్ట్ ఇదే
బిగ్ బాస్ 4- నిన్న ఎపిసోడ్ లో కూడా నామినేషన్ ప్రక్రియనే జరిగింది మొత్తం. మొన్న ఎపిసోడ్ లో ముగ్గురు నామినేషన్ చూపించగా నిన్న ఎపిసోడ్ లో మిగిలిన హౌస్ మేట్స్ నామినేషన్ ప్రక్రియను చూపించారు. ఎపిసోడ్ స్టార్టింగే అభిజిత్ నామినేషన్.. అభి అవినాష్ ను అమ్మ రాజశేఖర్ ను చేసాడు. ఈ క్రమంలో అమ్మ రాజశేఖర్ కు అభికి పెద్ద అర్గ్యూమెంటే జరిగింది. ఎదుటివారిని మాట్లాడనివ్వరు అని చెప్పి అమ్మ రాజశేఖర్ కు రీజన్ చెప్పాడు. దానితో అసహనానికి గురైన అమ్మరాజశేఖర్ అభికి మాట్లాడే చాన్సివ్వకుండా ఆగ్రహం వ్యక్తం చేసాడు. అందరూ నా జీవితాన్ని అవమానపరుస్తున్నారని ఆవేశంతో ఊగిపోయాడు. ఈ ఇద్దరి అర్గ్యూమెంట్ లో అవినాష్ రాగా అభి…
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "మన్మథుడు "
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "మన్మథుడు " మూవీ ఘనవిజయం సాధించింది. సొనాలీ బింద్రే , అన్షు కథానాయికలు. "మన్మథుడు " మూవీ కి స్టోరీ , డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. త్రివిక్రమ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులను అలరించింది. హీరో నాగార్జున కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది.
అప్పుడు క్రష్ - ఇప్పుడు అమ్మ
జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ 'రాధే శ్యామ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఇటలీలో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే విడుదల చేసిన పూజా హెగ్డే, ప్రభాస్ ఫస్ట్ లుక్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు మోషన్ పోస్టర్ అయితే అదిరిపోయింది. మరో ప్రేమ కావ్యంలా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది ఆ మోషన్ పోస్టర్ ను చూస్తే.
ఫ్యాన్ కు మాటిచ్చిన ఎన్టీఆర్
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మన హీరోలు తాము చేసే పనుల ద్వారా హీరోలనిపించుకుంటారు. కేవలం సినిమాల్లో మెసేజ్ లు ఇవ్వడమే కాదు.. సమాజ సేవ చేయడంలో కూడా మన హీరోలు ఎప్పుడూ ముందుంటారు. హీరోలంటే అభిమానులకు ఎంత ప్రేమ ఉంటుందో.. తమ అభిమానులపై కూడా అదే ప్రేమను... అదే అభిమానాన్ని చూపిస్తారు మన హీరోలు. ఇక అనారోగ్యంతో ఉన్న తమ అభిమానులను స్వయంగా కలిసిన హీరోలు కూడా చాలా మంది వున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్, రామ్ చరణ్ ఇలా పలువురు హీరోలు తమ అభిమానుల లాస్ట్ విష్ ను తీర్చినవాళ్ళే. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఒక ఫ్యాన్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పడంతోపాటు మాటిచ్చాడు కూడా.
పిక్చర్ పర్ఫెక్ట్.. యాదృచ్చికం అనేది అసాధారణం
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. మహేష్ కు సంబంధించి కానీ.. పిల్లలు గౌతమ్, సితార లకు సంబంధించి కానీ ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే వుంటారు. అంతేకాదు పాత జ్ఞాపకాలను కూడా అపుడప్పుడు గుర్తుచేసుకుంటుంది నమ్రత. ఇక ఇప్పుడు తాజాగా తన ఇన్‌స్టాగ్రాములో తన పెళ్లి ఫొటోను పోస్ట్ చేసి అభిమానులతో షేర్ చేసుకుంది. ఇక తన పెళ్లి ఫొటో పోస్ట్ చేస్తూ పిక్చర్ పర్ఫెక్ట్.. అప్పుడు.. ఇప్పుడు.. యాదృచ్చికం అనేది అసాధారణం. జీవితంపరిపూర్ణంగా సాగుతుంటుంది. పెళ్ళిళ్ళు స్వర్గ లోకంలో జరుగుతుంటాయి అని కామెంట్ పెట్టింది. నమ్రత షేర్ చేసిన ఫోటో నెటిజన్స్‌ని…
క్యాచీ టైటిల్ తో నాగశౌర్య ?
పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ హీరో నాగశౌర్య వరస మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. వేరే బ్యానర్ మూవీస్ లో నటిస్తూనే నాగశౌర్య తన స్వంత బ్యానర్ పై మూవీస్ నిర్మిస్తున్నారు. దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో "కల్యాణ వైభోగమే " మూవీ లో హీరోగా నటించిన నాగశౌర్య ఇప్పుడు మరో దర్శకురాలు సౌజన్య దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకుంటుంది.
హీరో రామ్ కు మరోసారి జోడీగా అనుపమ పరమేశ్వరన్ ?
సూపర్ హిట్ "అ ఆ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ తన , అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "ప్రేమమ్ "," శతమానం భవతి ", "హలో గురు ప్రేమకోసమే ", రాక్షసుడు" వంటి సూపర్ హిట్ మూవీస్ లో అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. స్లిమ్ గా మరింత అందంగా మారిన అనుపమ ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న "18పేజెస్ " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పుడు మరో మూవీ కి కథానాయిక గా ఎంపిక అయ్యారని సమాచారం.
మరో సినిమాకు రెడీ అయిన రాజ్ తరుణ్
టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురు చూసే హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. రీసెంట్గా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఒరేయ్ బుజ్జిగా అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవ్వగా ఈ సినిమాకు కూడా మిశ్రమ ఫలితమే దక్కింది. . రాధామోహన్ నిర్మించగా, మాళవికానాయర్ కథానాయికగా నటించింది.
'మిస్ ఇండియా' - కెరీర్ కోసం కలలు కనే యువత చూడాల్సిన సినిమా
మహానటి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఇక ఇప్పుడు మరో మహిళా ప్రధానమైన సినిమాతో ముందుకు వస్తుంది. నరేంద్రనాథ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మిస్ ఇండియా'. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా రేపు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా చూడటానికి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏం ఉన్నాయో చూద్దాం.
గోదావరి యాస నేర్చుకుంటున్న సుధీర్ బాబు
పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను ఇప్పటికే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'శ్రీదేవి సోడా సెంటర్' లో అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేయగా... ఈ సినిమాలో సుధీర్ ఫుల్ మాస్ లుక్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. సుధీర్ బాబు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నట్టే కనిపిస్తుంది.
హైదరాబాద్ లో "ఖిలాడి "
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , స్టార్ హీరోయిన్ శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. "క్రాక్ " మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. సంక్రాంతికి రిలీజ్ కానుందని సమాచారం. ఇప్పుడు రవితేజ మరో మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
'తలైవి' పొలిటికల్ ఎపిసోడ్స్ కు వీఎఫ్ఎక్స్
ఏఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కరోనా వల్ల షూటింగ్ కు కాస్త బ్రేక్ రాగా రీసెంట్ గానే తిరిగి షూటింగ్ ను ప్రారంభించారు.