తెలుగు , తమిళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు భాషల మూవీస్ లో కాజల్ బిజీగా ఉన్నారు. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “, “మోసగాళ్ళు “, “ఇండియన్ 2”, “హే సినామికా “(తమిళ ), “ముంబై సాగా (హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “క్వీన్ ” మూవీ తమిళ రీమేక్ కాజల్ ప్రధాన పాత్రలో రూపొందిన “ప్యారిస్ ప్యారిస్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అక్టోబర్ 30 వ తేదీ కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు గౌతమ్ పరిణయమాడిన విషయం తెలిసిందే. ప్రతీ ఒక్కరి జీవితంలో వివాహం ఒక ముఖ్యమైన ఘట్టం . కొత్త జీవితపు ఆనందాలు , అనుభూతులకు కొత్త జంటకు సమయం సరిపోదన్న విషయం తెలిసిందే. కాజల్ ఇప్పుడు ఆ ఆనందాలకు తాత్కాలిక విరామం ప్రకటించించి షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డ్యాన్స్ డైరెక్టర్ బృంద దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న “హే సినామికా “తమిళ మూవీ లో కాజల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. నవంబర్ 10 వ తేదీ కాజల్ షూటింగ్ లో పాల్గొంటున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది. పని పట్ల కాజల్ కమిట్ మెంట్ కు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: