‘ఆర్ఆర్ఆర్’ కోసం ఎదురుచూస్తున్నా అంటున్న హాలీవుడ్ బ్యూటీ..!

Hollywood Actress Olivia Morris Shows Her Eagerness To Join RRR Movie Shooting

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడగా..ఫైనల్ గా ఇటీవలే షూట్ ను స్టార్ట్ చేశారు. ఇక ఇటీవలే ఈ సెట్ లో హాలీవుడ్ నటి.. ఈ సినిమాలో లేడీ స్కాట్ గా చేస్తున్న ఆలిసన్ డూడి అడుగుపెట్టేసింది. బాలీవుడ్ నటి అలియా భట్ కూడా త్వరలోనే సెట్ లో అడుగుపెట్టనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఫైనల్ గా మిగిలింది మరో హాలీవుడ్ నటి ‘ఒలివియా మోరిస్’. మరి కరోనా వల్ల ఇక్కడివల్లే షూట్ లో పాల్గొనడానికి చాలా కష్టమవుతుంది. అలాంటిది అక్కడినుండి ఇక్కడికి రావాలంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు అసలు  ‘ఒలివియా మోరిస్’ నటించే అవకాశం ఉందా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్టైంది. దీనికి కారణం ‘ఒలివియా మోరిస్’ తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఒక వీడియోనే కారణం. అయితే అది ఇప్పటి వీడియో కాదులెండి. ఏడాది క్రితం ఆర్ఆర్ఆర్ కోసం తాను ఇండియా వచ్చినప్పటి వీడియో పోస్ట్ చేసింది. ఆ విషయం తెలుపుతూ.. ఆర్ఆర్ఆర్ షూట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది.

 

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.