‘గుర్తుందా శీతాకాలం’ – అతిథి పాత్రలో మేఘ

Actress Mega Akash To Do A Special Cameo Role In Actor Satydev Upcoming Movie Gurthunda Seethakalam

నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్లుగా కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో గుర్తుందా శీతాకాలం పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ముందు చెప్పినట్టే సింగల్ షెడ్యూల్ లోనే ఈ సినిమా షూట్ ను పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు. దీనిలోభాగంగానే నిర్విరామంగా షూటింగ్ జరుపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో మరో హీరోయిన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు మేఘా సుబ్రహ్మణ్యం. ‘చల్ మోహనరంగ, లై’ సినిమాలతో ఆకట్టుకున్నా సరైన హిట్ అందుకోలేని మేఘ. ఆ తర్వాత తెలుగులో పెద్దగా ఛాన్స్ లు కూడా రాలేదు. అయితే ఈ గ్యాప్ లో తమిళ్ లో సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో తెలుగులో మరోసారి నటించే అవకాశం దొరికింది. మరి ఈ సినిమాతో అయినా మేఘ కెరీర్ కు బ్రేక్ వస్తుందేమో చూద్దాం.

నాగ శేఖర్ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాను నాగశేఖర్, భావన రవి నిర్మిస్తున్నారు. కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + twelve =