శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్”మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. “వకీల్ సాబ్ ” మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని ఒక స్టూడియో సెట్ లో జరుగుతుంది. హీరో పవన్ కళ్యాణ్ పై కోర్ట్ సన్నివేశాలను దర్శకుడు వేణు తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ స్మార్ట్ లుక్ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. “వకీల్ సాబ్ ” మూవీ పోస్టర్స్ , మగువా సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న “వకీల్ సాబ్ ” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సక్సెస్ ఫుల్ యాంకర్ గా రాణిస్తున్న శ్రీముఖి , “వకీల్ సాబ్ ” మూవీ సెట్ లో పవన్ కళ్యాణ్ ను కలసి ఆయనతో సెల్ఫీ తీసుకున్నారు. ఆ సెల్ఫీ ని శ్రీముఖి “ఏం రాయాలో తెలియడం లేదనీ , లవ్ లవ్ లవ్ పవర్ స్టార్ “అంటూ సోషల్ మీడియా లో షేర్ చేశారు. ప్రేక్షక , అభిమానులలోనే కాకుండా సెలబ్రిటీస్ లో కూడా క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ వరస మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: