‘నార‌ప్ప’ షూటింగ్ షురూ త్వరలో టీజర్..!

Naarappa Movie Team Resume Shooting Work In Hyderabad, Plans To Bring Out Movie Teaser Soon

వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలాక్ డౌన్‌కి ముందే 60 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక రీసెంట్‌గానే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హైద‌రాబాద్ ప‌రిస‌ర‌ప్రాంతాల్లో షూటింగ్‌ పునఃప్రారంభించింది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సందర్భంగా నిర్మాత‌లు సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను మాట్లాడుతూ – “అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలోని పాల్తూరు గ్రామంలో ‘నారప్పస‌ షూటింగ్ ప్రారంభించి తమిళ నాడులోని కురుమలై మ‌రియు తిరిచందూర్ సమీపంలో ఉన్న తెరికాడు రెడ్ డెసర్ట్ లో కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేశాం. క‌రోనా వ్యాప్తి కార‌ణంగా నిలిపివేసిన షూటింగ్‌ని త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో తిరిగి ప్రారంభించాం. ప్రియమణి, రావు రమేష్, రాజీవ్ కనకాల త‌దిత‌ర‌ ప్రధాన తారాగణమంతా పాల్గొనగా కీలకమైన సన్నివేశాలు మరియు క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో 80 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. మిగిలిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను పూర్తిచేసి త్వ‌ర‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌స్తాం” అన్నారు. అంతేకాదు త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ 13 వెంకటేష్ పుట్టిన రోజు కావడంతో ఆ రోజున టీజర్ ను రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్.

కాగా ప్రియమణి ఈ సినిమాలో సుందరమ్మగా నటిస్తుంది. నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌న్నా పాత్రలో కార్తీక్ ర‌త్నం నటిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − seven =