రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో విలన్ గా నటించి తన నటనతో అందర్నీ మెప్పించి తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు సుదీప్. కన్నడలో స్టార్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నా.. అప్పుడప్పుడు తెలుగులో కూడా పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూనే వున్నాడు. ఇప్పుడు మరో సినిమాలో కూడా బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియనుమ్’ సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయదశమి రోజు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
ఇక ఇదిలావుండగా ఈ సినిమాలో పవన్ తో పాటు రానా నటించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆతర్వాత రానా కాదు నితిన్ నటించనున్నారు అంటూ టాక్ వచ్చింది.ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. అదే సుదీప్. పృథ్వీ రాజ్ పాత్రలో సుదీప్ నటిస్తున్నట్టు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఇటీవలే పవన్ ను సుదీప్ కలిసిన నేపథ్యంలో ఈ వార్తల్లో నిజం ఉండొచ్చు అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























