కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 24

Adipurush Film Director Om Raut Applauds Fan Made First Look Picture Of Prabhas
ఫస్ట్ లుక్

'ఆదిపురుష్' ప్రభాస్ లుక్ కు డైరెక్టర్ రియాక్షన్

బాహుబలి సిరీస్, సాహో సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా పేరుతెచ్చుకున్న ప్రభాస్ తన తర్వాత సినిమాలు కూడా అదే రేంజ్ లో తీస్తున్నాడు. ప్రస్తుతం ఒక మూడు నాలుగు భారీ బడ్జెట్ సినిమాలే లైన్ లో ఉన్నాయి. ఇక ప్రస్తుతం అయితే రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఇటలీలో షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మెగాస్టార్ త్వరగా కోలుకోవాలంటూ సెలబ్రిటీల ట్వీట్స్

తనకు ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ కరోనా పాజిటివ్ వచ్చిందని మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. `ఆచార్య` సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్న సందర్భంగా చేయించుకున్న కోవిడ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని చిరంజీవి ట్విటర్ ద్వారా వెల్లడించారు. 'ఆచార్య' షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాన`ని చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక దీనితో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కన్నడ రీమేక్ లో హీరోగా సునీల్ ?

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన కామెడీ టైమింగ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సునీల్ ప్రేక్షకులను అలరించారు. స్టార్ కమెడియన్ సునీల్ హీరోగా మారి "అందాల రాముడు ', "మర్యాద రామన్న ", "భీమవరం బుల్లోడు ", "ఉంగరాల రాంబాబు " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సునీల్ హీరోగా నటించిన కొన్ని సినిమాలు నిరాశ పరచడంతో తిరిగి కమెడియన్ గా పలు మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సునీల్ ఇప్పుడు ఒక కన్నడ మూవీ తెలుగు రీమేక్ లో హీరోగా నటించనున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మూవీస్ తో ప్రియాంక జవాల్కర్ బిజీ

మోడల్ , యాక్ట్రెస్ , ఫ్యాషన్ డిజైనర్ ప్రియాంక జవాల్కర్ చిన్న వయసు లోనే సూపర్ హిట్ "జీన్స్ " మూవీ లో ఐశ్వర్య రాయ్ ను చూసి యాక్టింగ్ పై ఆసక్తి పెంచుకున్నారు. కంప్యూటర్ సైన్స్ &ఇంజనీరింగ్ లో బిటెక్ కంప్లీట్ చేసిన ప్రియాంక కు 2 షార్ట్ ఫిల్మ్స్ లో నటించే అవకాశం వచ్చింది. హైదరాబాద్ లోని ఒక యాక్టింగ్ స్కూల్ లో యాక్టింగ్ స్కిల్స్ ను ప్రియాంక డెవలప్ చేసుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మిడ్ నైట్ షూట్ లో వరుణ్ తేజ్

ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఈ సినిమా కోసం ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది.

TFN Adminవాట్సాప్
Drushyam 2 Movie Team Completes Shooting Work.
షూటింగ్ అప్‌డేట్

"దృశ్యం 2" మూవీ షూటింగ్ పూర్తి

ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై జీతూ జోసెఫ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ , మీనా జంటగా రూపొందిన థ్రిల్లర్ "దృశ్యం "మలయాళ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో మోహన్ లాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బెస్ట్ ఫిల్మ్ గా కేరళ స్టేట్ , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న "దృశ్యం " మూవీ తెలుగు , తమిళ , కన్నడ , హిందీ , సింహళ భాషలలో రీమేక్ జరుపుకుని ఘనవిజయం సాధించింది. చైనీస్ భాషలో రీమేక్ జరుపుకున్న ఫస్ట్ ఇండియన్ మూవీ గా "దృశ్యం " మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాబాయ్ తో అబ్బాయి సినిమా కన్ఫామ్

రానా ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా వున్నాడు. ప్రస్తుతం 'విరాట పర్వం', అరణ్య సినిమాలతో బిజీ గా ఉన్నాడు. కరోనా లేకపోతే ఈ సినిమాలు ఎప్పుడో రిలీజ్ అయ్యేవి. కానీ కరోనా వల్ల అది కుదరలేదు. అయితే ఇప్పుడు తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇచ్చిన అప్ డేట్ దగ్గుబాటి ఫ్యాన్స్ ను దిల్ కుష్ చేస్తుంది. ఇంతకీ రానా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చెప్పొడో తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

లైఫ్‌ ఈజ్‌ బ్యాక్ అంటున్న మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబానికి కేటాయించాల్సిన టైంలో మాత్రం ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వరు. అందుకే మహేష్ నీ ఫ్యామిలీ మ్యాన్ అని కూడా అంటారు. ఇక సినిమా సినిమాకు మధ్యలో గ్యాప్ తీసుకొని ఒక ట్రిప్ కు వెళ్లడం మహేష్ ఫ్యామిలీకి అలవాటు. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఫ్యామిలీ ట్రిప్ వేసి ఆ తర్వాత పరుశురాం సినిమా షూటింగ్ లో పాల్గొనాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల అది కుదరలేదు. గ‌త ఏడెనిమిది నెల‌లుగా కరోనా వ‌ల‌న ఎక్క‌డికి వెళ్ళ‌లేక‌పోయారు. కేవలం ఇంటికే ప‌రిమిత‌మై పిల్ల‌ల‌తో స‌రదా క్ష‌ణాలు గడిపారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మాల్దీవుల్లో మెహరీన్ బర్త్ డే

సక్సెస్ ఫుల్ "కృష్ణ గాడి వీర ప్రేమ గాథ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ మెహరీన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "మహానుభావుడు" , "రాజా ది గ్రేట్ ", "F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ " మూవీస్ తో మెహరీన్ ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ మెహరీన్ తెలుగు చిత్రాలతో పాటు తమిళ , పంజాబీ చిత్రాలలో కూడా నటించారు. యాక్షన్ థ్రిల్లర్ "అశ్వద్ధామ " మూవీ తో మెహరీన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు .

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'పుష్ప' - రేపటినుండి షూటింగ్ స్టార్ట్

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలు ఇప్పటికే షూటింగ్ లు మొదలు పెట్టారు. కొంతమంది మిగిలిఉన్న షూటింగ్ భాగాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఇక ఇప్పుడు బన్నీ కూడా షూటింగ్ కు రెడీ అయినట్టు తెలుస్తుంది. నవంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్ ను రేపటినుండి స్టార్ట్ చేస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ వారు వీడియో విడుద‌ల చేసి అధికారికంగా ప్రకటించారు. వీడియోలో అల్లు అర్జున్, సుకుమార్ ‌కి సంబంధించిన విజువ‌ల్స్ కూడా ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మెగాస్టార్ కు కరోనా పాజిటివ్

టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీస్ కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. కొంతమందికి కాస్త లక్షణాలు ఉండి టెస్ట్ చేసుకున్నాక పాజిటివ్ వచ్చిన వాళ్లు ఉంటే.. అసలు మాకు ఏ లక్షణాలు లేవు అయినా పాజిటివ్ వచ్చిందని చెప్పిన సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోకు కూడా ఇదే జరిగింది. ఆ అగ్ర హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు చిరుకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సమంత ఇన్ స్టాగ్రామ్ లేటెస్ట్ ఫొటో

బ్లాక్ బస్టర్ "ఏ మాయ చేసావె " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత ఆ మూవీ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ అందుకున్నారు. సమంత టాలీవుడ్ , కోలీవుడ్ స్టార్ హీరోలకు జంటగా నటించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నందిని రెడ్డి , సమంత కాంబినేషన్ లో రూపొందిన "జబర్దస్త్ ", "ఓ బేబీ " మూవీస్ ఘనవిజయం సాధించాయి.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

యష్ బర్త్ డే కి కె.జి.యఫ్ 2 టీజర్..?

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ సంచలన విజయంతో ఇప్పుడు కె.జి.యఫ్ 2 పై ఎంత క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా వచ్చి వారి ఎదురుచూపులకు బ్రేక్ వేసింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కరోనా వల్ల ఇంకా వెనక్కి వెళ్ళింది. ఇక ఇన్ని నెలలు కరోనా వల్ల సినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టారు. ఈ షూటింగ్ లో యష్ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ ఫైనల్ షెడ్యూల్ లోనే సంజయ్ దత్ కూడా పాల్గొనబోతున్నారు. త్వరలోనే సినిమా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'రెడీ టు గో' అంటున్న కాజల్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి అక్టోబర్ 30న జరిగిన సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ కిచ్లూతో వివాహం జరిగింది. ముంబయిలోని ఓ హోటల్‌లో ఇరు కుటుంబసభ్యులు అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక విహహం తర్వాత కాజల్ తన ఫొటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. ఇటీవల మొదటి కార్వా చౌత్‌ని జరుపుకున్న కాజల్ ఆ ఫొటోస్ కూడా షేర్ చేసింది.

TFN Adminవాట్సాప్
Kamal 232 Movie Title Teaser Is All Set To Be Unveiled Today On The Occasion Of Kamal Hassan Birthday
ట్రైలర్ & టీజర్

కమల్ 232 - టైటిల్ టీజర్ రిలీజ్

‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్ సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడు. ఇది కమలహాసన్ నటించే 232వ చిత్రం. అయితే ఈసినిమా ఆగిపోయిందంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే అదేం లేదని ఈ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ లుక్ తో అధికారిక ప్రకటన రిలీజ్ చేయడంతో రూమర్స్ కు చెక్ పడింది.

TFN Adminవాట్సాప్
Weekly Roundup: Checkout The Tollywood Top Movie Updates For This Week
సినిమా వార్తలు

RECAP.. ఈ వారం టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ న్యూస్

గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు 'దితెలుగుఫిలింనగర్ .కమ్' ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అల్లరి నరేష్ కీలక నిర్ణయం

"కితకితలు ", "అత్తిలి సత్తి బాబు ఎల్ కె జి ", "సీమ శాస్త్రి ", "బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి ", "సుడిగాడు ", "బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ ", "సెల్ఫీ రాజా " వంటి కామెడీ ఎంటర్ టైనర్ మూవీస్ లో తనదైన కామెడీ టైమింగ్ తో అల్లరి నరేష్ ప్రేక్షకులను అలరించారు. "గమ్యం " మూవీ లో అల్లరి నరేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. అల్లరి నరేష్ ప్రస్తుతం "నాంది ", "బంగారు బుల్లోడు "మూవీస్ లో నటిస్తున్నారు. "నాంది " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
Samantha Akkineni Shares Her Latest Photo On Instagram and Gives It A Caption Feeling Good.
సినిమా వార్తలు

"ఫీలింగ్ గుడ్ "- సమంత

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 " వెబ్ సిరీస్ లో ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో నటించిన సమంత , దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 4 కు దసరా రోజున హోస్ట్ గా అద్భుతంగా ఆ షో ను రక్తి కట్టించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

Team TFNవాట్సాప్
Shruti Haasan Sends Out Birthday Wishes To Her Father Kamal Haasan On Instagram
సినిమా వార్తలు

డాడీ బర్త్ డే కు శృతి స్వీట్ విషెస్

బాలనటుడిగా "కలత్తూర్ కన్నమ్మ " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన కమల్ హాసన్ దక్షిణాది భాషలతో పాటు హిందీ, బెంగాలీ బాషలలో 230 మూవీస్ కు పైగా నటించారు. పలు భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి కమల్ హాసన్ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. యాక్టర్ , రైటర్ , డ్యాన్సర్ , కొరియోగ్రాఫర్ , లిరిసిస్ట్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ గా చిత్ర పరిశ్రమకు 6 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న కమల్ హాసన్ ను పద్మశ్రీ , పద్మభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

పూజాహెగ్డే ఇటలీ షూటింగ్ ఎక్స్ పీరియన్స్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఇటలీ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ "మూవీ తెరకెక్కుతుంది. ఇటీవలే "రాధేశ్యామ్ "మూవీ ఇటలీ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. హైదరాబాద్ లో జరిగే మరో షూటింగ్ షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. పూజాహెగ్డే ప్రస్తుతం అఖిల్ హీరోగా రూపొందుతున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.

Team TFNవాట్సాప్

షేర్