మిడ్ నైట్ షూట్ లో వరుణ్ తేజ్

Actor Varun Tej Shares A Sneak Peek Of His Movie Shoot During The Midnight On Instagram

ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఈ సినిమా కోసం ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా నిబంధనల నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా కోసం వరుణ్ అర్ధరాత్రుళ్లు కూడా కష్టపడి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని వరుణ్ స్వయంగా తన ఇన్స్టాలో ఫొటో షేర్ చేసి మరి తెలుపుతున్నాడు. రాత్రి 2 గంటల సమయంలో షూటింగ్ జరుపుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. డిసెంబర్ లో చెల్లి నిహారిక పెళ్లి పనులు ఉండటంతో బాక్సర్ షూటింగ్ ను త్వరగా పూర్తి చేయాలన్న ప్లాన్ లో ఉన్నాడు వరుణ్.

కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − nine =