మెగాస్టార్ త్వరగా కోలుకోవాలంటూ సెలబ్రిటీల ట్వీట్స్

Tollywood Film Celebrities Pour In Their Wishes For Speedy Recovery Of Mega Star Chiranjeevi

తనకు ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ కరోనా పాజిటివ్ వచ్చిందని మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. `ఆచార్య` సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్న సందర్భంగా చేయించుకున్న కోవిడ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని చిరంజీవి ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘ఆచార్య’ షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాన`ని చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక దీనితో మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాదు కరోనా బారిన పడిన మెగాస్టార్ చిరంజీవి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సినీ ప్రముఖులు కూడా ట్వీట్లు చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిరంజీవిగారూ.. త్వరగా కోలుకోండి. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ మహేష్ ట్వీట్ చేసాడు.

జాగ్రత్తగా ఉండండి. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అని రవితేజ ట్వీట్ చేసాడు.

 

మామయ్యా.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అని ఉపాసన ట్వీట్ చేసింది.

 

 

 

 

 

 

 

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 12 =