‘రెడీ టు గో’ అంటున్న కాజల్

Kajal Aggarwal Latest Pictures On Instagram Gives Us Enough Clue About Her Trip

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి అక్టోబర్ 30న జరిగిన సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ కిచ్లూతో వివాహం జరిగింది. ముంబయిలోని ఓ హోటల్‌లో ఇరు కుటుంబసభ్యులు అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక విహహం తర్వాత కాజల్ తన ఫొటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. ఇటీవల మొదటి కార్వా చౌత్‌ని జరుపుకున్న కాజల్ ఆ ఫొటోస్ కూడా షేర్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా త్వరలోనే ఈ జంట హనీమూన్‌‌కు కూడా బయలుదేరుతున్నట్టు తెలుస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ లో తను పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తేనే అర్ధమవుతుంది. బ్యాగ్‌లు, పాస్ట్‌పోర్ట్‌లు ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది. `బ్యాగులు సర్దేసుకున్నాం`, `రెడీ టు గో` అంటూ విమానం ఎమోజీలు ఉన్న పొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది.

కాగా నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచమైన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కాజ‌ల్ ప్ర‌స్తుతం మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ ఇండియన్ 2ల‌లో న‌టిస్తుంది. వీటితో పాటు విష్ణు మోసగాళ్లు, జాన్ అబ్రహాంతో ఓ చిత్రంలోనూ ఆమె నటిస్తుంది. హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత `ఆచార్య` షూటింగ్‌కు కాజల్ హాజరుకాబోతున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.