డాడీ బర్త్ డే కు శృతి స్వీట్ విషెస్

Shruti Haasan Sends Out Birthday Wishes To Her Father Kamal Haasan On Instagram

బాలనటుడిగా “కలత్తూర్ కన్నమ్మ ” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన కమల్ హాసన్ దక్షిణాది భాషలతో పాటు హిందీ, బెంగాలీ బాషలలో 230 మూవీస్ కు పైగా నటించారు. పలు భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి కమల్ హాసన్ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. యాక్టర్ , రైటర్ , డ్యాన్సర్ , కొరియోగ్రాఫర్ , లిరిసిస్ట్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ గా చిత్ర పరిశ్రమకు 6 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న కమల్ హాసన్ ను పద్మశ్రీ , పద్మభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం సూపర్ హిట్ “ఇండియన్ “(భారతీయుడు ) మూవీ సీక్వెల్ “ఇండియన్ 2 “మూవీ లో నటిస్తున్నారు. ఈ రోజు (నవంబర్ 7 )కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కమల్ హాన్ తనయ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ తన తండ్రి కి స్వీటెస్ట్ బర్త్ డే విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే బాపూజీ , అప్పా , డాడీ @కమల్ హాసన్ , ఈ సంవత్సరం కూడా మీ జీవితంలో మెమొరబుల్ ఇయర్ గా మారాలని కోరుకుంటున్నా అంటూ తండ్రి తో ఉన్న తన చైల్డ్ హుడ్ ఫోటో ను ఇన్ స్టా గ్రామ్ లో శృతి షేర్ చేశారు. ఆ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − seven =