కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 23

ఫస్ట్ లుక్

యానిమేషన్ ఫిల్మ్ "ధీర" ఫస్ట్ లుక్ రిలీజ్

ఏ థీరమ్ స్టూడియోస్ బ్యానర్ పై అరుణ్ కుమార్ రాపోలు దర్శకత్వంలో కృష్ణ దేవరాయలు ఆస్థాన అష్ట దిగ్గజ కవులలో వికటకవి గా పేరు గాంచిన తెనాలి రామకృష్ణ నేపథ్యంలో బుద్ధి రిద్ధి సిద్ధి క్యాప్షన్ తో "ధీర "యానిమేషన్ ఫిల్మ్ 12 భాషలలో రూపొందుతుంది. భారత దేశపు అతి పెద్ద క్యాప్చర్ ఫీచర్ ఫిల్మ్ గా రూపొందుతున్న యానిమేషన్ ఫిల్మ్ "ధీర " పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దీపావళి కి "సరిలేరు నీకెవ్వరు" తమిళ వెర్షన్ రిలీజ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ , ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , స్టార్ హీరోయిన్ రష్మిక జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ "సరిలేరు నీకెవ్వరు "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

పవన్ చేతుల మీదుగా 'గమనం' ట్రైలర్ రిలీజ్

సుజ‌నా రావు దర్శకత్వంలో శ్రియ ప్ర‌ధాన పాత్ర‌లో వస్తున్న సినిమా ‘గ‌మ‌నం’. చాలా గ్యాప్ తర్వాత శ్రియ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4.. అఖిల్-సోహైల్-మెహబూబ్ - దోస్త్ మేరా దోస్త్

మొన్ననామినేషన్స్ తో హీటెక్కిన హౌస్ నిన్న కెప్టెన్సీ టాస్క్ తో వాతావరణం మరింత వేడెక్కింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతే ఉదయాన్నే ఎవరి పనిలో వారు ఉండగా బిగ్ బాస్ ఎక్కువ లేట్ చేయకుండా కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. అమ్మ రాజశేఖర్ వెళ్లిపోవడంతో కెప్టెన్ గా ఎవరూ లేకపోవడంతో బిగ్ బాస్ మళ్లీ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. బాస్కెట్ బాల్స్‌ను గోల్ చేసే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఎవ‌రి బంతిని వాళ్లే కాకుండా మిగ‌తావాళ్లు గోల్ చేయాల్సి ఉంటుంది. బ‌జ‌ర్ మోగిన‌ప్పుడు ఆల‌స్యంగా గోల్ చేసిన బంతి మీద ఎవ‌రి ముఖం ఉంటే వాళ్లు అవుట్ అవుతారు. ఆఖ‌రి రౌండ్‌లో గోల్ చేసిన బంతి మీద ఎవ‌రి ముఖం ఉంటే వాళ్లే గెలిచిన‌ట్లు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

నాగ శౌర్య - రీతూ వర్మ సినిమా ఫ‌స్ట్ గ్లింఫ్స్ కు డేట్ ఫిక్స్

నాగశౌర్య ప్రస్తుతం సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య 20 వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పురాతన క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసేపనిలో పడ్డాడు. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా కొత్త సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. అక్టోబ‌ర్ లో షూటింగ్ రీస్టార్ట్ చేసిన చిత్ర‌యూనిట్ ఇపుడు ఫ‌స్ట్ గ్లింఫ్స్ వీడియోను విడుద‌ల చేసేందుకు రెడీ అవుతోంది. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు. న‌వంబ‌ర్ 13న సాయంత్రం 6.03 గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ట్విట‌ర్ ద్వారా తెలిపింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కుటుంబ కథా చిత్రం "పండంటి కాపురం"

జయప్రద పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ , విజయ నిర్మల జంటగా కుటుంబ సంబంధాల నేపథ్యంలో అన్నదమ్ముల కథగా రూపొందిన "పండంటికాపురం "(1972 ) మూవీ ఘనవిజయంసాధించి ప్రేక్షకాదరణ పొందింది. ఎస్ వి రంగారావు , గుమ్మడి , ప్రభాకర్ రెడ్డి , దేవిక , జమున , బి. సరోజాదేవి , అల్లు రామలింగయ్య , రాజ బాబు వంటి నటీనటులతో రూపొందిన "పండంటి కాపురం" బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. ఎస్ పి కోదండపాణి స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కన్ఫామ్ బాలయ్య సినిమాలో సయేషా

'లెజెండ్' సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్న సంగతి తెలిసిందే. రెండు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య కనిపించనున్నాడట. రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్రలో రెండు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య కనిపించనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'చిరు' లేకుండానే 'ఆచార్య' షూటింగ్

కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది.ఇక ఇన్ని నెలలు కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయింది. నిజానికి ఈ సినిమా షూట్ ను నిన్ననే ప్రారంభించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే ఆశ్చర్యంగా నిన్ననే చిరు తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి షాకిచ్చాడు.

TFN Adminవాట్సాప్
Actress Lavanya Tripathi Latest Photos Shared On Social Media Goes Viral
సినిమా వార్తలు

"అందాల రాక్షసి"

సక్సెస్ ఫుల్ "అందాల రాక్షసి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "దూసుకెళ్తా ", "భలే భలే మొగాడివోయ్""సోగ్గాడే చిన్ని నాయనా ", "అర్జున్ సురవరం"వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యతనిచ్చే లావణ్య తన వర్కౌట్ ఫొటోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'మిడిల్ క్లాస్ మెలోడీస్' ట్రైలర్ రిలీజ్

విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసాడు ఆనంద్ దేవరకొండ. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన దొరసాని సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ ఆనంద్ నటనకు మాత్రం మంచి పేరు వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అల్లుడు "అదుర్స్ "

సూపర్ హిట్ "రాక్షసుడు " మూవీ తరువాత హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "కందిరీగ "మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "అల్లుడు అదుర్స్ " మూవీ లో నటిస్తున్నారు. నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు కాగా సోనూ సూద్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సంక్రాంతి పండగకు "అల్లుడు అదుర్స్ " మూవీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
Rana Daggubati Latest Movie Tentatively Titled as Dheerudu
సినిమా వార్తలు

రానా దగ్గుబాటి "ధీరుడు"

సక్సెస్ ఫుల్ "లీడర్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రానా దగ్గుబాటి "కృష్ణం వందే జగద్గురుమ్ ", "బాహుబలి ", "బాహుబలి 2", "ఘాజీ ", నేనే రాజు నేనే మంత్రి " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "బాహుబలి ", "బాహుబలి 2" మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రానా బెస్ట్ విలన్ గా నంది అవార్డ్స్ అందుకున్నారు. తెలుగు భాషతో పాటు తమిళ , హిందీ భాషల మూవీస్ లో నటించిన రానా ప్రస్తుతం ఆ భాషల చిత్రాల కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అన్నయ్య త్వరగా కోలుకోవాలి

మెగాస్టార్ చిరంజీవి త‌న‌కు క‌రోనా పాజిటివ్ వచ్చిందని చెప్పిన సంగతి తెలిసిందే కదా. త‌న‌కు ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని.. ఆచార్య షూటింగ్ కోసం చెకప్ చేసుకోగా పాజిటివ్ వచ్చిందని చెప్పడంతో షాక్ అయ్యారు అందరూ. ఇక విషయం తెలిసిన వెంటనే సినీ సెలబ్రిటీస్ దగ్గనుండి అభిమానులు, సన్నిహితులు అందరూ చిరు త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం చిరు హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"పుష్ప" షూటింగ్ పునః ప్రారంభం

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప " మూవీ రూపొందుతుంది. జగపతి బాబు , ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శాండల్ వుడ్ లో బిజీగా ఉన్న హీరో , క్యారెక్టర్ ఆర్టిస్ట్ ధనంజయ్ నెగటివ్ షేడ్స్ ఉన్నఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నా పేరు అలా క్రిష్ గా మారింది

డైరెక్టర్ క్రిష్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.. తన సినిమాలు ఎంత డిఫరెంట్ గా వుంటాయో తెలుసు. నిజ జీవితానికి దగ్గరగా.. వైవిధ్యమైన కథలను తెరకెక్కించడంలో డైరెక్టర్ క్రిష్ స్టైలే వేరు. అందుకు గమ్యం, వేదం లాంటి సినిమాలే ఉదాహరణ. తొలి చిత్రం ‘గమ్యం’ నుంచి గ‌త చిత్రం ‘య‌న్టీఆర్ మ‌హానాయ‌కుడు` వ‌ర‌కు ఈ టాలెంటెడ్ టెక్నీషియ‌న్ రూపొందించిన సినిమాల‌న్నీ వేటిక‌వే ప్ర‌త్యేకంగా నిలుస్తాయి. అంతేకాదు.. సినిమాను ఫాస్ట్ గా కంప్లీట్ చేయడంలో కూడా దిట్ట. ఇక ఈరోజు క్రిష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నాగశౌర్య కౌబాయ్ లుక్

"ఊహలు గుస గుస లాడే ", "కల్యాణ వైభోగమే ", "ఛలో ", "ఓ బేబీ " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో యంగ్ హీరో నాగశౌర్య ప్రేక్షకులను అలరించారు. హీరో నాగశౌర్య ప్రస్తుతం పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. నాగశౌర్య స్వంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై మూవీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి ఐరా క్రియేషన్స్ సంస్థ మరో ప్రొడక్షన్ హౌస్ ఐరా సినిమాస్ ప్రారంభించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రామ్ చరణ్ ట్విట్టర్ రికార్డ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీతారాగణం తో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా "రౌద్రం రణం రుధిరం " మూవీ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న రామ్ చరణ్ , కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా రూపొందుతున్న "ఆచార్య "మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. రామ్ చరణ్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కోలుకున్న రాజ శేఖర్ - హాస్పిటల్ నుండి‌ డిశ్చార్జ్

టాలీవుడ్ ను కరోనా బాగానే పట్టి పీడిస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్ కరోనా బారిన పడ్డారు. కొంతమంది అయితే కోలుకున్నారు కానీ కొంతమందిని మాత్రం కోల్పోకతప్పలేదు. ఎస్పీబీ లాంటి గాన గంధర్వుడిని సైతం ఈ కరోనా మహమ్మారి బలిగొంది. ఇక ఈ రోజు మెగాస్టార్ చిరు సైతం కరోనా పాజిటివ్ వచ్చిందని ట్వీట్ చేసి పెద్ద షాకే ఇచ్చారు. దీనితో అందరూ చిరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫైట్ సీక్వెన్స్ షూట్ లో 'ఆర్ఆర్ఆర్'

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడగా..ఫైనల్ గా ఇటీవలే షూట్ ను స్టార్ట్ చేశారు. ఇక ఇటీవలే ఈ సెట్ లో హాలీవుడ్ నటి.. ఈ సినిమాలో లేడీ స్కాట్ గా చేస్తున్న ఆలిసన్ డూడి అడుగుపెట్టేసింది. బాలీవుడ్ నటి అలియా భట్ కూడా త్వరలోనే సెట్ లో అడుగుపెట్టనుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తలైవా రజనీకాంత్ బయోపిక్ మూవీ ?

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా బయోపిక్ మూవీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. లెజెండరీ ఫిల్మ్ స్టార్స్ నందమూరి తారక రామారావు , సావిత్రి బయోపిక్ మూవీస్ రూపొందాయి. లెజెండరీ యాక్ట్రెస్ , పొలిటికల్ లీడర్ జయలలిత బయోపిక్ "తలైవి "మూవీ రూపొందుతుంది. ఇప్పుడు కోట్లాది ప్రజల అభిమాన కథానాయకుడు తలైవా రజనీకాంత్ పై బయోపిక్ మూవీ రూపొందనుందని సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్