యష్ బర్త్ డే కి కె.జి.యఫ్ 2 టీజర్..?

KGF2 Teaser To Release For Actor Yash Birthday

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ సంచలన విజయంతో ఇప్పుడు కె.జి.యఫ్ 2 పై ఎంత క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా వచ్చి వారి ఎదురుచూపులకు బ్రేక్ వేసింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కరోనా వల్ల ఇంకా వెనక్కి వెళ్ళింది. ఇక ఇన్ని నెలలు కరోనా వల్ల సినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టారు. ఈ షూటింగ్ లో యష్ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ ఫైనల్ షెడ్యూల్ లోనే సంజయ్ దత్ కూడా పాల్గొనబోతున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ ను పూర్తి చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. యష్ పుట్టిన రోజు అంటే జనవరి 8న ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో అభిమానులు కూడా అప్ డేట్ ఇవ్వమని సోషల్ మీడియా వేదికగా అడుగుతూనే వున్నారు. దీనిలో భాగంగానే ఒక అభిమాని ట్విట్టర్ లో ఈ సినిమా నిర్మాత అయిన కార్తీక్ గౌడ్ ను టీజర్ అప్ డేట్ ఇవ్వమని అడుగగా.. దానికి కార్తీక్ యష్ పుట్టిన రోజు వుండే ఛాన్స్ వుంది అన్నట్టు హింట్ ఇచ్చాడు. చూద్దాం మరి అప్పుడువస్తుందా?అంతకంటే ముందే వస్తుందా..!

 

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి చూద్దాం ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో…ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =