టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలు ఇప్పటికే షూటింగ్ లు మొదలు పెట్టారు. కొంతమంది మిగిలిఉన్న షూటింగ్ భాగాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఇక ఇప్పుడు బన్నీ కూడా షూటింగ్ కు రెడీ అయినట్టు తెలుస్తుంది. నవంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్ ను రేపటినుండి స్టార్ట్ చేస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ వారు వీడియో విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు. వీడియోలో అల్లు అర్జున్, సుకుమార్ కి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటివరకూ ఆర్య, ఆర్య2 రాగా.. ఇప్పుడు మూడోసారి ‘పుష్ప’ సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్లో లారీ డ్రైవర్గా కనబడనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వాలి కానీ కరోనా వల్ల సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ రాలేదు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తుండగా మరో హీరోయిన్ గా నివేదా పేతురాజ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: