“కితకితలు “, “అత్తిలి సత్తి బాబు ఎల్ కె జి “, “సీమ శాస్త్రి “, “బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి “, “సుడిగాడు “, “బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ “, “సెల్ఫీ రాజా ” వంటి కామెడీ ఎంటర్ టైనర్ మూవీస్ లో తనదైన కామెడీ టైమింగ్ తో అల్లరి నరేష్ ప్రేక్షకులను అలరించారు. “గమ్యం ” మూవీ లో అల్లరి నరేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. అల్లరి నరేష్ ప్రస్తుతం “నాంది “, “బంగారు బుల్లోడు “మూవీస్ లో నటిస్తున్నారు. “నాంది ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ ఎంటర్ టైనర్ “నాంది ” మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో అల్లరి నరేష్ మాట్లాడుతూ … తన మూవీస్ లో కామెడీ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేవారే కానీ తన యాక్టింగ్ స్కిల్స్ ను తక్కువగా గుర్తించేవారనీ , “గమ్యం “, శంభో శివ శంభో “వంటి మూవీస్ లో తన నటనను ప్రేక్షకులు ప్రశంసించారనీ , ఇంతకు ముందు తన మూవీస్ సంవత్సరానికి 4లేదా 5 రిలీజ్ అయ్యేవనీ , క్వాంటిటీ కంటే క్వాలిటీ కి ప్రాధాన్యత నివ్వాలనే నిర్ణయం తీసుకున్నాననీ , సెలక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుంటున్నాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: