పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన కామెడీ టైమింగ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సునీల్ ప్రేక్షకులను అలరించారు. స్టార్ కమెడియన్ సునీల్ హీరోగా మారి “అందాల రాముడు ‘, “మర్యాద రామన్న “, “భీమవరం బుల్లోడు “, “ఉంగరాల రాంబాబు ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సునీల్ హీరోగా నటించిన కొన్ని సినిమాలు నిరాశ పరచడంతో తిరిగి కమెడియన్ గా పలు మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సునీల్ ఇప్పుడు ఒక కన్నడ మూవీ తెలుగు రీమేక్ లో హీరోగా నటించనున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జయతీర్థ దర్శకత్వంలో రిషబ్ శెట్టి , హరిప్రియ జంటగా రూపొందిన క్రైమ్ కామెడీ “బెల్ బాటం “కన్నడ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించింది. ఆ కన్నడ మూవీ తెలుగు రీమేక్ లో సునీల్ హీరోగా నటించనున్నారని సమాచారం. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. సునీల్ తిరిగి టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా మారి ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం. సునీల్
“కలర్ ఫొటో ” మూవీ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: