కమల్ 232 – టైటిల్ టీజర్ రిలీజ్

Kamal 232 Movie Title Teaser Is All Set To Be Unveiled Today On The Occasion Of Kamal Hassan Birthday

‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్ సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడు. ఇది కమలహాసన్ నటించే 232వ చిత్రం. అయితే ఈసినిమా ఆగిపోయిందంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే అదేం లేదని ఈ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ లుక్ తో అధికారిక ప్రకటన రిలీజ్ చేయడంతో రూమర్స్ కు చెక్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ రోజు నవంబర్ 7న కమల్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. విక్రమ్ అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు.

 

విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. యువ సంగీత దర్శకుడు అనిరుథ్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలుపెట్టాలని… వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

లోకేష్ దర్శకత్వంలో గత ఏడాది కార్తి హీరోగా విడుదలైన తమిళ చిత్రం ‘ఖైదీ’. ఈ సినిమాను ఇదే పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదలచేయగా.. ఘన విజయం సాధించింది. ఈ సినిమా ఇటు తెలుగులోనే కాకుండా తమిళ భాషలో కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు కనకరాజ్ దర్శకత్వంలో ఇలయదళపతి విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − two =