లైఫ్‌ ఈజ్‌ బ్యాక్ అంటున్న మహేష్ బాబు

Super Star Mahesh Babu Says Life Is Back On Track In His Latest Post On Instagram

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబానికి కేటాయించాల్సిన టైంలో మాత్రం ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వరు. అందుకే మహేష్ నీ ఫ్యామిలీ మ్యాన్ అని కూడా అంటారు. ఇక సినిమా సినిమాకు మధ్యలో గ్యాప్ తీసుకొని ఒక ట్రిప్ కు వెళ్లడం మహేష్ ఫ్యామిలీకి అలవాటు. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఫ్యామిలీ ట్రిప్ వేసి ఆ తర్వాత పరుశురాం సినిమా షూటింగ్ లో పాల్గొనాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల అది కుదరలేదు. గ‌త ఏడెనిమిది నెల‌లుగా కరోనా వ‌ల‌న ఎక్క‌డికి వెళ్ళ‌లేక‌పోయారు. కేవలం ఇంటికే ప‌రిమిత‌మై పిల్ల‌ల‌తో స‌రదా క్ష‌ణాలు గడిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇన్ని నెలల తర్వాత మహేష్ ట్రిప్ కు వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఫొటోని షేర్ చేసిన మ‌హేష్‌.. ‘కొత్త సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నాం. లైఫ్‌ ఈజ్‌ బ్యాక్‌ ఆన్‌ ట్రాక్‌’ అంటూ మాస్క్‌లు ధరించి గౌతమ్‌, సితారలతో కలిసి దిగిన ఓ సెల్ఫీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ను అమెరికాలోనే ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫ్యామిలీ ట్రిప్‌, షూటింగ్‌ రెండు కలిసేలా ఈ టూర్‌ను ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.