కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 21

ఫస్ట్ లుక్

ఓదెల రైల్వేస్టేషన్‌' - హెబ్బా ఫస్ట్‌లుక్ రిలీజ్

దీపావళి పండుగ సందర్భంగా పలు సినిమాల అప్ డేట్స్ వచ్చేసాయి. ఫ‌స్ట్ లుక్స్, టీజ‌ర్స్, ట్రైలర్స్ లను విడుద‌ల చేస్తూ ఫ్యాన్స్‌ని అల‌రిస్తున్నారు. దీనిలో భాగంగానే 'ఓదెల రైల్వేస్టేషన్‌' సినిమా నుండి కూడా అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో హెబ్బా పటేల్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పండుగ సందర్భంగా హెబ్బా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఫస్ట్ లుక్ ను చూస్తుంటే ఇందులో పల్లెటూరి అమ్మాయి రాధ అనే పాత్ర‌లో హెబ్బా న‌టిస్తున్నట్టు తెలుస్తుంది. డీ గ్లామర్ రోల్ లో ఆమె లుక్ ఆక‌ట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - మెహబూబ్ ఔట్.. ఎమోషన్ తో నిండిపోయిన హౌస్

బిగ్ బాస్ 4 - చూస్తుండగానే 10వ ఎపిసోడ్ ఎలిమినేషన్ కూడా అయిపోయింది. మెహబూబ్ హౌస్ నుండి బయటకు వచ్చేసాడు. మరి మెహబూబ్ ఎలిమినేషన్ తో హౌస్ లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో నిన్న రాత్రి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగే నాగార్జున‌ ఇంటిస‌భ్యుల‌తో గ‌ద్ద కుందేలు ఆట ఆడించారు. మొద‌ట గ‌ద్ద‌గా మారిన అభి కుందేలుగా ఉన్న ఇంటిస‌భ్యుల్లో నుంచి అఖిల్‌ను ప‌ట్టుకుని గద్ద‌గా మార్చేశాడు. ఇలా గేమ్ పూర్త‌య్యేస‌రికి సోహైల్‌ విన్నర్ అవ్వగా, అరియానా రన్నర్ గా మిగిలింది. ఆ త‌ర్వాత అరియానా సేఫ్ అయిన‌ట్లు తెలిపారు. అనంత‌రం విన్నర్ అయిన సోహెల్, రన్నర్ అయిన అరియానాను ఇద్దరు టీమ్ లీడర్స్ గా పెట్టి మరో గేమ్…

TFN Adminవాట్సాప్
Mega Star Chiranjeevi and Ram Charan Takes A Selfie Together On Diwali
సినిమా వార్తలు

దీపావళి సెల్ఫీ

ప్రజల జీవితాలలో వెలుగులు నింపే దీపావళి పండగను దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ఘనంగా జరుపుకున్నారు. మెగా స్టార్ చిరంజీవి, తన తనయుడు రామ్ చరణ్ తో పాటు కుటుంబ సభ్యులతో దీపావళి పండుగను వైభవంగా జరుపుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న "ఆచార్య " మూవీ లో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించనున్నారు. "ఆచార్య "మూవీ లో చిరంజీవి ,రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకొని అభిమానులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నయన్-విఘ్నేష్ రొమాంటిక్ పిక్

నయనతార విఘ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారు తమ రిలేషన్ గురించి ఎక్కడా ఇంతవరకూ ఓపెన్ చేయలేదు కానీ.. సోషల్ మీడియాలో తాము పలు సందర్భాల్లో కలిసి ఉన్న ఫొటో లు షేర్ చేస్తూ హింట్ ఇస్తూనే ఉంటారు. ఆ రూమర్స్ ఆగవు.. వీళ్లిద్దరు ఫొటోస్ షేర్ చేయడం ఆపరు. ఇటీవలే విఘ్నేష్ శివ‌న్ పుట్టిన రోజుకు చార్ట‌ర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకొని గోవా వెళ్లి సెల‌బ్రేట్ చేసుకొని వ‌చ్చారు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

ఓదెల రైల్వేస్టేషన్ - రేపే ఫస్ట్ లుక్

అశోక్ తేజ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఓదెల రైల్వేస్టేష‌న్'. ఈ సినిమాకు సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఏమైంది ఈవేళ‌, బెంగాల్ టైగ‌ర్ వంటి సూప‌ర్‌హిట్స్ అందించిన శ్రీ‌స‌త్య‌సాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహ‌న్ ప్రొడ‌క్ష‌న్ నెం.9గా ఈ సినిమా రూపొందనుంది. మొద‌టి షెడ్యూల్ పూర్తిచేసిన చిత్ర యూనిట్‌ ఇటీవలే రెండో షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే కొన్ని సీన్లను ఓదెల ర్వైల్వేస్టేషన్లో చిత్రీకరించగా మరికొన్ని సన్నివేశాలను ఓదెల మండలంలో తెర‌కెక్కించారు. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్షన్‌ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే హైద‌రాబాద్‌లో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'రాజా ది గ్రేట్' బెస్ట్ కామెడీ సీన్

మాస్ మహారాజ్ రవి తేజ బెంగాల్ టైగర్ సినిమా తరువాత చాలా టైం తీసుకుని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన సినిమా రాజా ది గ్రేట్. అప్పటివరకూ హిట్ లేక ప్లాప్స్ తో బాధపడుతున్న రవితేజకు ఈసినిమా కాస్త ఊరటనిచ్చింది. మంచి హిట్ తెచ్చిపెట్టింది. 2017 లో రిలీజ్ అయిన ఈ సినిమాలో రవితేజ అంధుడిగా కనిపించగా... రవితేజకు జోడీగా మెహ్రీన్ కౌర్ పిర్జాదా నటించింది. రాధిక, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంపత్ వంటి నటీనటులు ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించాడు.బేసిక్ గా అనిల్ రావిపూడి సినిమా అంటే కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

A1 ఎక్స్ ప్రెస్ - లాస్ట్ డే షూట్

డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే చాలా వరకూ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ఇన్నిరోజులు షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ లను మొదలు పెట్టారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సమంత సింపుల్ &సూపర్ లుక్

టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో సేంద్రియ పంటలు సాగు చేస్తూ , వర్కౌట్స్ చేస్తూ అభిమానులకు ఆరోగ్య టిప్స్ అందిస్తూ సమంత టైమ్ స్పెండ్ చేశారు. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న హారర్ కామెడీ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రాశీఖన్నా దీపావళి ముచ్చట్లు

కొత్త దుస్తులు , స్వీట్స్ , దీపాలు , బాణా సంచా, బంధు మిత్రులతో ప్రజలంతా వేడుకగా జరుపుకొనే పండగ దీపావళి. చిన్నారుల నుండి పెద్దవారు వరకూ సంతోషంగా జరుపుకొనే పండగ దీపావళి. అటువంటి పండగ గురించి తెలుగు , తమిళ భాష ల సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ఆకట్టుకుంటున్న అందాల రాశీఖన్నా మాటల్లోనే తెలుసుకొందాం.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

విజయ్ ఆంటోని కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

విభిన్నమైన సినిమాలు చేయడంలో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత మాత్రం ఉంటుంది. ఇక విజయ్ ఆంటోనీ సినీ కెరీర్ లోనే 'బిచ్చగాడు' సినిమా టర్నింగ్ పాయింట్ సినిమా అని చెప్పొచ్చు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించి పెట్టింది. ‌ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ ఆంటోని. ‘తమిళరసన్‌’, ‘అగ్ని సిరగుగళ్‌’, ‘ఖాకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అంతేకాదు మరోసారి బిచ్చగాడు 2 తో రావడానికి సిద్దమయ్యాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తిరిగి సెట్స్ కు రానా

తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో హీరో రానా దగ్గుబాటి బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రానా ప్రస్తుతం "విరాటపర్వం"మూవీ లో నటిస్తున్నారు. ముగింపు దశలో ఉన్న"విరాటపర్వం"మూవీ షూటింగ్ సింగల్ షెడ్యూల్ కంప్లీట్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. రానా హీరోగా తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందిన "అరణ్య " మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. గుణ శేఖర్ దర్శకత్వంలో రానా హీరో గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందనున్న "హిరణ్య కశ్యప"మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' టీమ్ నుండి దీపావళి విషెస్

ఈ మధ్య ఆర్ఆర్ఆర్ నుండి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ అభిమానులకు కాస్త ఊరట కలిగిస్తున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా రేపు దీపావళి కావడంతో అభిమానులకు మరో సర్ఫరైజ్ ఇచ్చారు. అందరికీ దీపావళి విషెస్ చెపుతూ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. ఇక ఫొటోల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ తెలుపు రంగు దుస్తుల్లో దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. తారక్, చెర్రీకి రాజమౌళి ఏదో వివరిస్తున్నట్లు ఓ ఫొటో ఉంది. వారి ముగ్గురి వెనుక ఆర్ఆర్ఆర్ అనే అక్షరాలు కనపడుతున్నాయి. చెర్రీ, తారక్ కలిసి, అలాగే విడివిడిగా కూడా ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం సోషల్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

యానిమేషన్ సినిమాకు బెల్లం కొండ సాయి శ్రీనివాస్ గాత్ర దానం

గత ఏడాది `రాక్ష‌సుడు`తో అల‌రించిన యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్... ప్రస్తుతం సాయి శ్రీనివాస్ ‘కందిరీగ’, ‘హైపర్‌’ చిత్రాల దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ‘అల్లుడు అదుర్స్‌' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఇస్మార్ట్‌ హీరోయిన్‌ నభా నటేష్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోతో జోడీ కడుతున్నారు. సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌పై జి. సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ సినిమాకు... దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

"మోసగాళ్ళు "టీజర్ రిలీజ్

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , AVA ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో బిగ్గెస్ట్ ఐటి స్కామ్ నేపథ్యంలో నిజ సంఘటనలతో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ "మోసగాళ్ళు " మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ACP కుమార్ గా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. నవదీప్ , నవీన్ చంద్ర , రూహి సింగ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శామ్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

#Nani28 కాంబినేషన్ సెట్ - త్వరలో టైటిల్ ప్రకటన

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా "టక్ జగదీష్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను... సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మెగా అభిమానులకు శుభవార్త

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా "అచార్య "మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. కరోనా కారణంగా నిలిచిపోయిన "ఆచార్య " మూవీ షూటింగ్ సుమారు 8 నెలల తరువాత పునః ప్రారంభం అయ్యింది. చిత్ర యూనిట్ అంతా కరోనా టెస్ట్స్ చేయించుకున్న నేపథ్యం లో చిరంజీవి తనకు కరోనా పాజిటివ్ అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Team TFNవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - హౌస్ మేట్స్ సీక్రెట్స్

బిగ్ బాస్ 4 - మొన్న ఎపిసోడ్ లో అఖిల్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లడంతో హౌస్ మేట్స్ అందరూ డల్ అయిపోయారు. ఇక నిన్న ఎపిసోడ్ లో పెద్దగా హైలైట్స్ కూడా ఏం లేవని చెప్పొచ్చు. ఎపిసోడ్ లోకి వస్తే స్టార్టింగ్ స్టార్టింగే అభి, సోహైల్, మెహబూబ్ అఖిల్ గురించి డిస్కషన్. అఖిల్ డిఫెండ్ చేసుకోకుండా ఎలా వెళ్తాడు అని అభి సోహైల్ తో మెహబూబ్ తో అంటూవుంటాడు. దానితో పాటు కెప్టెన్సీ టాస్క్ గురించి కూడా డిస్కస్ చేస్తారు. ఇదంత సీక్రెట్ రూమ్ లో ఉన్న అఖిల్ చూస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఐ యామ్ నో మెస‌య్య' - సోనూసూద్ జీవిత కథ

కరోనా వల్ల ఏర్పడిన గడ్డు పరిస్థితుల్లో ఎంతో మంది ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరిస్థితుల్లో చేతికి వెన్నెముక లేనట్టు సాయం చేసాడు సోనూ సూద్. కార్మికులని సొంతింటికి చేర్చ‌డం ద‌గ్గ‌ర నుండి తనను సాయం అడిగిన వాళ్లకు కూడా సాయం చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఆయన చేసిన సేవలకు సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ప్రశంసలు కురిపించారు. ఈ కరోనా వల్ల హీరో అయిన విలన్ ఎవరంటే సోనూసూదే.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'మాస్టర్ ' టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మాస్టర్‌'. సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో విజయ్ 'మాస్టర్' సినిమా కూడా ఒకటని చెప్పొచు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. కరోనా వల్ల థియేటర్స్ మూత పడటంతో సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇంట్లో ఇల్లాలు... వంటింట్లో ప్రియురాలు.. ఎవర్ గ్రీన్ బెస్ట్ కామెడీ సీన్స్

విక్టరీ వెంకటేష్, సౌందర్య హీరో హీరోయిన్స్ గా నటించిన ఇంట్లో ఇల్లాలు... వంటింట్లో ప్రియురాలు సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమానే. తమిళంలో భాగ్యరాజా కథతో మురుగేష్ దర్శకత్వంలో పాండిరాజన్ హీరోగా నటించిన ‘తైకులమే తైకులమే’ సినిమాను ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాగా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు వెంకీ. ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో.. వినీత మ‌రో క‌థానాయిక‌గా న‌టించ‌గా కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, బాబుమోహన్, ఏవీయస్, మాస్టర్ నాగ్ అన్వేష్ కీలక పాత్రల్లో నటించారు.1996 మే 22న రిలీజ్ అయిన ఈసినిమా అప్పట్లో సంచలన విజయం దక్కించుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్