నయన్-విఘ్నేష్ రొమాంటిక్ పిక్

Nayanthara and Vignesh Sivan Looks Adorable In Their Latest Pic Shared On Instagram

నయనతార విఘ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారు తమ రిలేషన్ గురించి ఎక్కడా ఇంతవరకూ ఓపెన్ చేయలేదు కానీ.. సోషల్ మీడియాలో తాము పలు సందర్భాల్లో కలిసి ఉన్న ఫొటో లు షేర్ చేస్తూ హింట్ ఇస్తూనే ఉంటారు. ఆ రూమర్స్ ఆగవు.. వీళ్లిద్దరు ఫొటోస్ షేర్ చేయడం ఆపరు. ఇటీవలే విఘ్నేష్ శివ‌న్ పుట్టిన రోజుకు చార్ట‌ర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకొని గోవా వెళ్లి సెల‌బ్రేట్ చేసుకొని వ‌చ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా మరో ఫొటో షేర్ చేసి రూమర్స్ కు స్టఫ్ ఇచ్చారు. న‌య‌న్- విఘ్నేష్‌ల‌కు సంబంధించిన రొమాంటిక్ పిక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో షేర్ చేయగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో హ‌ల్ చల్ చేస్తుంది. అంతేకాదు ఈ పిక్ కి పెళ్లెప్పుడు అనే కామెంట్స్ కూడా ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. మరి చూద్దాం వీరిద్దరు ఫైనల్ గా పెళ్లి పీటలు ఎక్కుతారా లేక అదేం లేదని మళ్ళీ కొట్టిపడేస్తారా..!

 

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

కాగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారి.. లేడీ సూపర్ స్టార్ గా దక్షిణాదిన దూసుకుపోతుంది నయనతార. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. తమిళ్‌లో నెట్రికన్‌, ముక్తి అమ్మాన్‌, అన్నాట్టే, కథువాకుల రెండు కాదల్ సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ. ముక్తి అమ్మాన్ సినిమాలో నయన్ మొదటిసారిగా అమ్మవారి పాత్రలో నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =