మాస్ మహారాజ్ రవి తేజ బెంగాల్ టైగర్ సినిమా తరువాత చాలా టైం తీసుకుని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన సినిమా రాజా ది గ్రేట్. అప్పటివరకూ హిట్ లేక ప్లాప్స్ తో బాధపడుతున్న రవితేజకు ఈసినిమా కాస్త ఊరటనిచ్చింది. మంచి హిట్ తెచ్చిపెట్టింది. 2017 లో రిలీజ్ అయిన ఈ సినిమాలో రవితేజ అంధుడిగా కనిపించగా… రవితేజకు జోడీగా మెహ్రీన్ కౌర్ పిర్జాదా నటించింది. రాధిక, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంపత్ వంటి నటీనటులు ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించాడు.బేసిక్ గా అనిల్ రావిపూడి సినిమా అంటే కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. ఈ సినిమాలో కూడా తల్లి సెంటిమెంట్, కామెడీతో సినిమాను నడిపించాడు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమాలో ఎన్నో బెస్ట్ కామెడీ సీన్స్ ఉండగా.. మీ కోసం ఒక బెస్ట్ కామెడీ సీన్. కింద లింక్ క్లిక్ చేసి మీరు కూడా నవ్వుకోండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: