దీపావళి పండుగ సందర్భంగా పలు సినిమాల అప్ డేట్స్ వచ్చేసాయి. ఫస్ట్ లుక్స్, టీజర్స్, ట్రైలర్స్ లను విడుదల చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తున్నారు. దీనిలో భాగంగానే ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమా నుండి కూడా అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో హెబ్బా పటేల్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పండుగ సందర్భంగా హెబ్బా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఫస్ట్ లుక్ ను చూస్తుంటే ఇందులో పల్లెటూరి అమ్మాయి రాధ అనే పాత్రలో హెబ్బా నటిస్తున్నట్టు తెలుస్తుంది. డీ గ్లామర్ రోల్ లో ఆమె లుక్ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా అశోక్ తేజ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. ఓదెల రైల్వేస్టేషన్, ఓదెల పరిసర ప్రాంతాలు, హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాను కూడా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
ఇంకా ఈ సినిమాలో సాయి రోనక్, పూజితా పొన్నాడ తదితరులు నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్‌హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఈ సినిమా రూపొందనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: