కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 22

షూటింగ్ అప్‌డేట్

రకుల్ ప్రీత్ ఫస్ట్ షూటింగ్ ఎక్స్ పీరియన్స్

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 2హిందీ మూవీస్ , నితిన్ "చెక్ ", కమల్ హాసన్ "ఇండియన్ 2 "(తమిళ ) మూవీస్ లో నటిస్తున్న రకుల్ , క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ తేజ్ హీరోగా రూపొందుతున్న మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత నిచ్చే రకుల్ తన వర్కౌట్ ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దర్శకుడు శంకర్, హీరో యశ్ ల మల్టీ స్టారర్ ?

దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1 "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. "కె జి ఎఫ్ చాప్టర్ 1 "మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. సుమారు 250 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. "కె జి ఎఫ్ చాప్టర్ 1 "మూవీ తో హీరో యశ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం "కె జి ఎఫ్ చాప్టర్ 2 "మూవీ తెరకెక్కుతుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో అజిత్ రిస్కీ బైక్ స్టంట్స్

బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో స్టార్ హీరో అజిత్ , హుమా ఖురేషి జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "వాలిమై " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో కార్తికేయ నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్ , చెన్నై లలో కొంత షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న "వాలిమై " మూవీ షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి కోలుకోవాలని లారెన్స్ స్పెషల్ పూజ

మెగాస్టార్ చిరంజీవి కి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. చిరునే స్వయంగా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. ఇక ఇదిలా ఉండగా చిరుకి కరోనా అని తెలిసిన వెంటనే అభిమానులు.. సినిమా సెలబ్రిటీస్ పెద్ద ఎత్తున స్పందించి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇక చిరుకు ఎంతో మంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. వారిలో రాఘవ లారెన్స్ కూడా ఒకడన్న సంగతి తెలిసిందే. ఇక లారెన్స్ కూడా చిరుకు కరోనా పాజిటివ్ అని తెలిసి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అంతేకాదు చిరు కోసం స్పెషల్ గా తనకి ఎంతో ఇష్టమైన రాఘవేంద్ర స్వామికి పూజలు కూడా…

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

"ఈశ్వరుడు " మూవీ శింబు , నిధి ల ఫస్ట్ లుక్ రిలీజ్

మాధవ్ మీడియా బ్యానర్ పై సుశీంద్రన్ దర్శకత్వంలో స్టార్ హీరో శింబు , అందాల నిధి అగర్వాల్ జంటగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన "ఈశ్వరన్ "(ఈశ్వరుడు )తమిళ మూవీ సంక్రాంతి పండగకు రిలీజ్ కానుంది. థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఈ మూవీ రెండవ తమిళ మూవీ. మొదటి తమిళ మూవీ "భూమి " రిలీజ్ కాకుండానే ఇస్మార్ట్ బ్యూటీ నిధి తన రెండవ మూవీ "ఈశ్వరన్ "తో తమిళ ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మెగా అల్లుడి కొత్త సినిమా లాంచ్

మెగా స్టార్ అల్లుడిగా కళ్యాణ్ దేవ్ వెండి తెరకు పరిచయమైనా మామ పేరును వాడుకోకుండా తన స్వయంకృషితో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. సినిమా జయాపజయాల గురించి ఆలోచించకుండా కొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పటికే పులి వాసు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ దేవ్. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడలో కూడా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో 'సూపర్ మచ్చి' అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా.. కన్నడలో ‘మీనాక్షి’ అనే టైటిల్‌ తో వస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మిగిలిన పనులు పూర్తి చేసుకునే పనిలో పడింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సూపర్ హిట్ "ఆకాశం నీ హద్దురా !"

2D ఎంటర్ టైన్ మెంట్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సుధ కొంగర దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య , అపర్ణ బాలమురళి జంటగా రూపొందిన "సూరరై పోట్రు "(ఆకాశం నీ హద్దురా !) తమిళ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , పరేష్ రావల్ ముఖ్య పాత్రలలో నటించారు. ఖరీదైన విమాన ప్రయాణాన్ని డెక్కన్ ఎయిర్ లైన్స్ స్థాపించి సాధారణ ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చిన జి ఆర్ గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన "ఆకాశం నీ హద్దురా !" మూవీ ప్రేక్షకుల ప్రశంసలతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మా గ్యాంగ్‌తో డిన్నర్

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సినిమా అయిపోయిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో ట్రిప్ కు వెళ్తాడన్న సంగతి తెలిసిందే. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ వెళ్ళాల్సింది.. కానీ కరోనా వల్ల కుదర్లేదు. ఇక ఇన్నినెలలు తర్వాత ట్రిప్ కు వెళ్లారు. ప్రస్తుతం మహేష్ ట్రిప్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ ట్రిప్ కు సంబంధించి ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో ఫోటోని షేర్ చేశాడు. ఓ రెస్టారెంట్‌లో పిల్లలు సితార, గౌతమ్‌లతో కలిసి డిన్నర్ చేస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. `మా గ్యాంగ్‌తో డిన్నర్` అని కామెంట్ చేశాడు. నమ్రత కూడా తన ఇన్స్టాలో పలు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక బ్లాక్ &వైట్ ఫొటో

తెలుగు , కన్నడ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 2020 సంవత్సరంలో "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రష్మిక ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "పుష్ప "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందనున్న మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ గురించి సత్యదేవ్ - బ్రిలియంట్ హ్యూమన్ బీయింగ్

టాలీవుడ్ లో ఉన్న టాలెంటడ్ నటుల్లో సత్యదేవ్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'మిడిల్ క్లాస్ మెలోడీస్' పై రష్మిక ప్రశంసలు

దొరసాని సినిమా తర్వాత ఆనంద్ దేవ‌ర‌కొండ చేస్తున్న రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. వినోద్ అనంతోజు దర్శకత్వంలో వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను కూడా అమెజాన్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ నెల నవంబర్ 20వ తేదీన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రయిలర్ ను నిన్ననే రిలీజ్ చేయగా ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. సొంతంగా హోటల్ పెట్టుకోవాలని చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'గ్రీన్ ఛాలెంజ్' పూర్తి చేసిన రకుల్, నభా

గ్రీన్ ఛాలెంజ్.. ఈ ఛాలెంజ్ లో ఇప్పటివరకూ ఎంతో మంది సినీ సెలెబ్రిటీస్ పాల్గొని మొక్కలు నాటారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ రకుల్ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొని ఛాలెంజ్ ను పూర్తి చేసింది. హీరో నాగచైతన్య విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రకుల్ తాజాగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. `గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒకరిద్దరి కార్యక్రమం కాదు. మనందరం కలిసి చేయాల్సిన కార్యక్రమం. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలి. ఇంత మంచి కార్యక్రమం మొదలుపెట్టి ఎంతో బాధ్యతతో ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతల`ని పేర్కొంది. తర్వాత ఈ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

లిటిల్ సోల్జర్స్ - క్యూటెస్ట్ ఇంట్రడక్షన్ సీన్

1996 లో వచ్చిన ‘లిటిల్ సోల్జర్స్’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. కావ్య, బాలాదిత్య బాల నటులుగా.. కోటా శ్రీనివాస రావు, గిరిబాబు, బ్రహ్మానందం, రాళ్ళపల్లి, సుధాకర్, హీరా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఓ క్లాసిక్ అనే చెప్పాలి. చిన్నపిల్లలు ఇప్పటికీ ఈ సినిమాను ఎంతో ఇష్టపడతారు. మనకి ‘అమృతం’ వంటి బ్లాక్ బస్టర్ సీరియల్ ను అందించిన నిర్మాత గుణ్ణం గంగరాజు ఈ చిత్రానికి డైరెక్టర్.

TFN Adminవాట్సాప్
Rebel Star Prabhas Completes 18 Years In Tollywood
సినిమా వార్తలు

18 ఇయ‌ర్స్ - స‌క్సెస్‌ఫుల్ జ‌ర్నీ

కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రభాస్ ప్రతి సినిమాకు ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు ప్యాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. ప్యాన్‌ ఇండియా హీరోగా వరుస సినిమాలను చేస్తూ తెలుగు సినిమా మార్కెట్‌ రేంజ్‌ను ప్యాన్‌ ఇండియా రేంజ్‌కు మారుస్తున్న తిరుగులేని స్టార్‌. హీరోగా ఈశ్వర్‌ సినిమాతో ఆయన కెరీర్‌ స్టార్‌ అయ్యింది. ఓ టాలీవుడ్‌ హీరోపై ఎంటైర్‌ ఇండియన్‌ సినిమాలో వెయ్యికోట్ల రూపాయల పెట్టుబడుతో మూడు భారీ ప్రాజెక్టులు రూపొందుతున్నాయంటే, ప్రభాస్‌ కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు...

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రాశీఖన్నా వర్కౌట్ సెల్ఫీ

తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో రాశీఖన్నా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం తమిళ మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాక్ డౌన్ సమయం లో ఇంటికే పరిమితం అయిన రాశీఖన్నా తమిళ భాష , గిటార్ సాధన చేస్తూ , వర్కౌట్స్ , ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ టైమ్ స్పెండ్ చేశారు. షూటింగ్స్ పునః ప్రారంభం కావడంతో రాశీఖన్నా బిజిగా మారారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నాగశౌర్య కు జోడీగా షిర్లీ సెషియా

హీరో నాగశౌర్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో విలు విద్య నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "#NS20 "మూవీ లో నటిస్తున్నారు. కేతిక శర్మ కథానాయిక. ఈ మూవీ తో పాటు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "#NS21"మూవీ హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ రెండు మూవీస్ ఏక కాలంలో తెరకెక్కుతున్నాయి. ఈ మూవీ లో రీతూ వర్మ కథానాయిక.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న 'క్రాక్'

మాస్ మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న మూడో చిత్రం 'క్రాక్‌'. ఇటీవలే క్రాక్ టీం కూడా ఆఖరి షెడ్యూల్ ను మొదలుపెట్టేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లో హీరో హీరోయిన్లు ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌పై ఓ పాట‌ను చిత్రీక‌రించ‌నున్నారట. ఆ పాట‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌వుతుందని చెపుతున్నారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పూజాహెగ్డే బుల్లి అభిమాని కామెంట్స్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం "రాధేశ్యామ్ ", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీస్ లో నటిస్తున్నారు. రెండు బాలీవుడ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ పూజాహెగ్డే అభిమానులను అలరిస్తున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'మేజర్' లో నా షూట్ కంప్లీట్

అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రామరాజు ఛాలెంజ్ పూర్తి చేసిన 'ఆర్ఆర్ఆర్' టీమ్

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులందరూ ఎంతో ప్రేమతో మొక్కలు నాటుతున్నారు. అంతేకాదు తమ సన్నిహితులకు కూడా ఛాలెంజ్ ను విసురుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ప్రభాస్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన రామ్ చరణ్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటాడు. అనంతరం అలియా భట్, దర్శకుడు రాజమౌళి, తన నూతన చిత్రం RRR సినిమా చిత్ర బృందం సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.

TFN Adminవాట్సాప్

షేర్