‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుండి దీపావళి విషెస్

Team RRR Sends Special Diwali Wishes Sharing These Adorable Pictures Of Ram Charan and Jr NTR

ఈ మధ్య ఆర్ఆర్ఆర్ నుండి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ అభిమానులకు కాస్త ఊరట కలిగిస్తున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా రేపు దీపావళి కావడంతో అభిమానులకు మరో సర్ఫరైజ్ ఇచ్చారు. అందరికీ దీపావళి విషెస్ చెపుతూ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. ఇక ఫొటోల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ తెలుపు రంగు దుస్తుల్లో దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. తారక్, చెర్రీకి రాజమౌళి ఏదో వివరిస్తున్నట్లు ఓ ఫొటో ఉంది. వారి ముగ్గురి వెనుక ఆర్ఆర్ఆర్ అనే అక్షరాలు కనపడుతున్నాయి. చెర్రీ, తారక్ కలిసి, అలాగే విడివిడిగా కూడా ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

కాగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లు అలరించిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =