24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , AVA ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో బిగ్గెస్ట్ ఐటి స్కామ్ నేపథ్యంలో నిజ సంఘటనలతో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ “మోసగాళ్ళు ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ACP కుమార్ గా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. నవదీప్ , నవీన్ చంద్ర , రూహి సింగ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శామ్ ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మోసగాళ్ళు ” మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి. భారీ బడ్జెట్ తో , అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన “మోసగాళ్ళు ” మూవీ లో విష్ణు మంచు , కాజల్ అన్నాచెల్లెళ్ళు గా నటించడం విశేషం. దీపావళి పండగ సందర్భంగా ACP కుమార్ (సునీల్ శెట్టి )ను పరిచయం చేస్తూ “మోసగాళ్ళు ” మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “మోసగాళ్ళు ” మూవీ తెలుగు తో పాటు కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: