దీపావళి సెల్ఫీ

Mega Star Chiranjeevi and Ram Charan Takes A Selfie Together On Diwali

ప్రజల జీవితాలలో వెలుగులు నింపే దీపావళి పండగను దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ఘనంగా జరుపుకున్నారు. మెగా స్టార్ చిరంజీవి, తన తనయుడు రామ్ చరణ్ తో పాటు కుటుంబ సభ్యులతో దీపావళి పండుగను వైభవంగా జరుపుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న “ఆచార్య ” మూవీ లో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించనున్నారు. “ఆచార్య “మూవీ లో చిరంజీవి ,రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకొని అభిమానులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం” మూవీ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న “RRR” మూవీ షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొంటున్నారు. ఇక దీపావళి పండగ ను ఆనందంగా జరుపుకున్న చిరంజీవి , రామ్ చరణ్ సెల్ఫీ లతో సందడి చేశారు. ఆ సెల్ఫీ ఫొటోలను రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ సెల్ఫీ లు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.